టూరిస్టులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి వైజాగ్ కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జి.. ఎంట్రీ ఫీజు ఎంత?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకానికి పెద్దపీట వేస్తోంది. అందులో భాగంగా వైజాగ్ కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జి నిర్మించింది. ఇది అందుబాటులోకి వచ్చింది.
విశాఖ నగరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు.

ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ తట్టుకునేలా గ్లాస్ బ్రిడ్జిని డిజైన్ చేశామని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ చెప్పారు. అతి త్వరలో కైలాసగిరి త్రిశూల్ ప్రాజెక్టును కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. వీఎంఆర్డీఏ ద్వారా పర్యాటకానికి పెద్దపీట వేస్తున్నట్టుగా పేర్కొన్నారు. విశాఖను పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు.
కైలాసగిరి కొండపై భారతదేశంలోనే అతి పొడవైన స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జి ఇది. ఈ స్కైవాక్ నుంచి చూస్తే.. అందమైన తీరప్రాంతాన్ని, అద్భుతమైన ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ఈ గాజు వంతెన రాష్ట్రంలో ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారనుంది.
చైనాలోని ఐకానిక్ గ్లాస్ స్కైవాక్‌ల నుండి ప్రేరణ పొంది ఈ 50 మీటర్ల కాంటిలివర్ నిర్మాణం కేరళలోని వాగమోన్ గ్లాస్ బ్రిడ్జి తరహాలో రూపొందించారు. దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జి ఇది. జర్మన్ నుంచి దిగుమతి చేసుకున్న గాజు, ఉక్కుతో రూపొందించారు. ఈ వంతెన భూమి నుండి 862 అడుగుల ఎత్తులో, సముద్ర మట్టానికి 1,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇది తీరప్రాంత వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా తయారు చేశారు.
ట్రిపుల్-లేయర్డ్, 40 మి.మీ మందం కలిగిన టెంపర్డ్ లామినేటెడ్ గ్లాస్ ఉంటుంది. ఒకేసారి 500 టన్నుల బరువు మోయగలదు. గంటకు రూ.250 కి.మీ వేగంతో వచ్చే గాలులను తట్టుకోగలదు. అయితే భద్రతా దృష్ట్యా 40 మందికి మాత్రమే దీనిపైకి అనుమతి ఉంటుంది.
విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA), SSM షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్, భారత్ మాతా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ వెంచర్ అయిన ఆర్జే అడ్వెంచర్స్ మధ్య భాగస్వామ్యం కింద ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చేశారు. దీని వ్యయం రూ.7 కోట్లు. 10–15 నిమిషాలకు టిక్కెట్ల ధర రూ.300 ఉండే అవకాశం ఉంది. ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఎంట్రీ ఉండనుంది. ఇలాంటి గాజు వంతెనలు ప్రస్తుతం రాజ్‌గిర్ (బీహార్), సిక్కిం, వయనాడ్ (కేరళ) లలో ఉన్నాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


