డిసెంబర్ 1న వైజాగ్‌ కైలాసగిరి స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం.. భారత్‌లో ఇదే అతి పొడవైనది

ఏపీ ప్రభుత్వం పర్యాటకానికి పెద్ద పీట వేస్తోంది. రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులు చేపడుతోంది. అందులో భాగంగా వైజాగ్ కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జిని నిర్మించింది. దేశంలోనే ఇది అతి పొడవైనది.

Published on: Nov 30, 2025, 15:33:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విశాఖపట్నంలోని ఐకానిక్ కైలాసగిరి కొండలు పర్యాటక రంగానికి మరింత ఊపునిచ్చేందుకు రెడీ అయ్యాయి. భారతదేశంలోనే అతి పొడవైన గాజు వంతెన డిసెంబర్ 1న ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఎంపీ శ్రీభరత్ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జిని ప్రారంభిస్తారని VMRDA అధికారులు తెలిపారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గ్లాస్ స్కైవాక్ దాదాపు 55 మీటర్లు విస్తరించి కాంటిలివర్డ్ నిర్మాణంగా రూపొందించారు. దిగుమతి చేసుకున్న జర్మన్ గాజుతో తయారు చేసిన ఈ వాక్‌వే సందర్శకులకు భద్రత, ఉల్లాసకరమైన అనుభవాన్ని అందిస్తుంది.

కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జి
కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జి

సముద్ర మట్టానికి 862 అడుగుల ఎత్తులో ఉన్న ఈ వంతెన బంగాళాఖాతం, తూర్పు కనుమలు, వైజాగ్ నగర అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది. దీనిపై ఒకేసారి 100 మంది కూడా నడవవచ్చు. అయితే సౌకర్యం, సేఫ్టీ కోసం అధికారులు ప్రారంభంలో ఒక బ్యాచ్‌కు 40 మంది సందర్శకులకు ప్రవేశాన్ని పరిమితం చేస్తారు.

సాహస ప్రియులకు ఈ స్కై వాకింగ్ థ్రిల్లింగ్‌గా ఉండనుంది. ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో భారీ సంఖ్యలో ప్రజలు వస్తారని అధికారులు అనుకుంటున్నారు. దేశంలో ఇప్పటివరకు 40 మీటర్ల పొడవైన గాజు వంతెన కేరళలో ఉంది. ఇప్పుడు వైజాగ్‌లో అంతకుమించి ఉంటుంది. నైట్ టైమ్‌లో త్రివర్ణ రంగులతో కూడిన విద్యుత్ కాంతులతో మెరిసేలా గ్లాస్ బ్రిడ్జిని తీర్చిదిద్దారు.

చాలాసార్లు ఈ బ్రిడ్జిని టెస్ట్ చేశారు. టూరిస్టుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఎంట్రీ ఫీజుపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ గాజు వంతెనను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. 40 ఎంఎం మందం కలిగిన ల్యామినేటెడ్ గ్లాస్ ఉపయోగించారు. దీనిని జర్మనీ నుంచి దిగుమతి చేశారు. ఒకేసారి 500 టన్నుల వరకు భారం మోస్తుంది. కానీ భద్రత దృష్ట్యా అధికారులు పర్యాటకుల సంఖ్యను పరిమితం చేశారు.

పర్యాటకంలో కైలాసగిరి కీలకపాత్ర పోషించేందుకు డిసెంబర్ 1న స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం అవుతుంది. ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More