బంగాళాఖాతంలో తుపాను! ఈ రాష్ట్రాలకు ఐఎండీ భారీ వర్ష సూచన..

బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. మత్స్యకారులకు హెచ్చరికలు ఇచ్చింది. ఈ నెల 27 వరకు అనేక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Published on: Nov 23, 2025, 08:15:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు భారీ వర్షాల హెచ్చరికలను జారీ చేసింది.

బంగాళాఖాతంలో తుపాను!
బంగాళాఖాతంలో తుపాను!

నవంబర్ 22న మలక్కా జలసంధి, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. నవంబర్ 24 నాటికి ఇది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

భారీ వర్షాల అంచనా..

ఐఎండీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం వర్షపాతం అంచనాలు ఇలా ఉన్నాయి:

అండమాన్, నికోబార్ దీవులు: నవంబర్ 27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా నవంబర్ 24, 25 తేదీల్లో అతి భారీ వర్షాలు ఉండవచ్చు.

దక్షిణాది రాష్ట్రాలు:

తమిళనాడు: నవంబర్ 25 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కేరళ అండ్​ మాహే: నవంబర్ 22 నుంచి 26 వరకు భారీ వర్షాలు పడవచ్చు.

లక్షద్వీప్: నవంబర్ 22, 23 తేదీల్లో భారీ వర్షాలుంటాయి.

రాయలసీమ: నవంబర్ 22న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు

నవంబర్ 23న అండమాన్, నికోబార్ దీవుల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఉంటుందని ఐఎండీ వాతావరణ బులెటిన్‌లో అంచనా వేసింది. దీనితో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 24-25 తేదీల్లో వర్ష తీవ్రత పెరుగుతుంది. అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

"ఆ తర్వాత, నవంబర్ 26, 27 తేదీలలో ఈ వాతావరణ వ్యవస్థ మరింత వాయువ్య దిశగా కదలడం వల్ల వర్షాల తీవ్రత తగ్గుతుంది. కానీ అండమాన్, నికోబార్ దీవులకు భారీ వర్ష హెచ్చరిక కొనసాగుతుంది," అని ఐఎండీ పేర్కొంది.

ప్రాంతాల వారీగా పిడుగులు, గాలులు

నవంబర్ 24 వరకు తమిళనాడు, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానం, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు.

నవంబర్ 26 వరకు కేరళ, మాహే, లక్షద్వీప్‌లో, నవంబర్ 22న తీర ప్రాంత కర్ణాటక, దక్షిణ అంతర్గత కర్ణాటకలో ఇలాంటి పరిస్థితే ఉంటుంది.

అండమాన్, నికోబార్ దీవులలో ఈ వారం పొడవునా గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

ప్రయాణాలకు అంతరాయం

ఈ వాతావరణ మార్పు అనేక తీర ప్రాంతాలు, ద్వీపాలలో, ముఖ్యంగా అండమాన్, నికోబార్ దీవులలో ప్రయాణ పరిస్థితులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అక్కడ నవంబర్ 23, 24 తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నవంబర్ 23-24 తేదీలలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున్న ఐఎండీ హెచ్చరికలు ప్రస్తుతం పోర్ట్ బ్లెయిర్, హేవ్‌లాక్ (స్వరాజ్ ద్వీప్), ఇతర ప్రముఖ ద్వీప ప్రాంతాల్లో ఉన్న పర్యాటకులకు చాలా ముఖ్యమైనవి

మత్స్యకారులకు హెచ్చరిక

మత్స్యకారులు నవంబర్ 27 వరకు కింద పేర్కొన్న ప్రాంతాల్లోకి వేటకు వెళ్లవద్దని ఐఎండీ సూచించింది:

అరేబియా సముద్రం: నవంబర్ 25 వరకు కేరళ తీరం వెంబడి, లక్షద్వీప్, కొమొరిన్ ప్రాంతాల్లో.

బంగాళాఖాతం:

  • నవంబర్ 22 నుంచి 27 మధ్య అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో.
  • నవంబర్ 22న నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో.
  • నవంబర్ 23, 24 తేదీల్లో నైరుతి బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాల్లో.
  • నవంబర్ 25న నైరుతి బంగాళాఖాతంలోని అత్యధిక ప్రాంతాల్లో, నవంబర్ 26న మొత్తం నైరుతి బంగాళాఖాతంలో.
  • నవంబర్ 25, 26 తేదీలలో మధ్య బంగాళాఖాతం దక్షిణ భాగంలో.
  • నవంబర్ 22, 27 మధ్య గల్ఫ్​ ఆఫ్​ మన్నార్​లో.
  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More