కావలిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు - రైళ్ల రాకపోకలకు అంతరాయం..!
నెల్లూరు జిల్లాలోని కావలి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నిజామాబాద్ నుంచి రేణిగుంట వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రెండు బోగీలు పూర్తిగా పట్టాలు తప్పగా… ట్రాక్ దెబ్బతిన్నది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
నెల్లూరు జిల్లా లో గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. కావలి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. నిజామాబాద్ నుంచి రేణిగుంటకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రెండు బోగీలు పట్టాలు తప్పగా… ట్రాక్ దెబ్బతిన్నది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు,సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటనా స్థలికి డివిజన్ రైల్వే అధికారులు చేరుకొని రైళ్ల పునరుద్దరణ పనులను పర్య వేక్షిస్తున్నారు. విజయవాడ - చెన్నై మార్గంలో నడుస్తున్న కొన్ని రైళ్లకు అంతరాయం కలిగింది. మధ్యాహ్నం లోగా ట్రాక్ పునరుద్దరణ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. అన్ని రైళ్ల రాకపోకలను తిరిగి ఆ ట్రాక్ మీదుగా వెళ్లే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
మరోవైపు గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటన పైన రైల్వేశాఖ అధికారులు విచారణ చేస్తున్నారు. సాంకేతిక సమస్యతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు గుర్తించినట్లు సమాచారం. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత రైల్వేశాఖకు నివేదికను అందించనున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

