బంగాళాఖాతంలో ఏర్పడిన 'మురసు' తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. విజయవాడ నగరాన్ని ఇప్పటికే దట్టమైన మబ్బులు కమ్మేయగా, సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము మధ్య నెల్లూరు-నరసాపురం ప్రాంతాల మధ్య ఈ తీవ్ర తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం…. ఈ తుఫాన్ ప్రస్తుతం నెల్లూరుకు తూర్పు-ఆగ్నేయంగా 160 కిలోమీటర్లు, చెన్నైకి ఈశాన్యంగా 180 కిలోమీటర్లు, కావలికి తూర్పు-ఆగ్నేయంగా 180 కిలోమీటర్లు, ఒంగోలుకు ఆగ్నేయంగా 210 కిలోమీటర్లు, మరియు మచిలీపట్నానికి దక్షిణంగా 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
విమానాల రాకపోకలకు తీవ్ర విఘాతం
తుఫాన్ తీవ్రత దృష్ట్యా విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రయాణించే 10 ఇండిగో (IndiGo) విమానాలను సోమవారం రద్దు చేశారు. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమానాశ్రయానికి బయలుదేరే ముందు విమానాల సమాచారాన్ని సంబంధిత సంస్థల ద్వారా సరిచూసుకోవాలని ఎయిర్‌పోర్టు అధికారులు సూచించారు. వాతావరణం అనుకూలించని కారణంగా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండిగో సంస్థ వెల్లడించింది.
అల్లకల్లోలంగా సముద్రం…
నెల్లూరు జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కొందరు వేటగాళ్లు సముద్రంలో చిక్కుకోవటంతో వారిని సురక్షిత ప్రాంతానికి చేర్చారు.వీరిని నిజాంపట్నం తీర ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. తుఫాన్ నేపథ్యంలో మత్స్యకారులెవరూ కూడా సముద్రంవైపు రావొద్దని అధికారులు హెచ్చరించారు.
మరోవైపు నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, బాపట్ల, కృష్ణా జిల్లాల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రెవెన్యూ, పోలీస్, విద్యుత్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించింది. ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఇప్పటికే ప్రభుత్వం అలర్ట్ చేసింది.
తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, అత్యంత భారీ వర్షాలతో పాటు హఠాత్తుగా అకస్మాత్తుగా ప్లాష్ ఫ్లడ్స్ (ఆకస్మిక వరదలు) వచ్చే ప్రమాదం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా 6 ఎన్డీఆర్ఎఫ్ (NDRF), 7 ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలను సిద్ధంగా ఉంచారు.
{{/usCountry}}తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, అత్యంత భారీ వర్షాలతో పాటు హఠాత్తుగా అకస్మాత్తుగా ప్లాష్ ఫ్లడ్స్ (ఆకస్మిక వరదలు) వచ్చే ప్రమాదం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా 6 ఎన్డీఆర్ఎఫ్ (NDRF), 7 ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలను సిద్ధంగా ఉంచారు.
{{/usCountry}}