Cyclone Murasu : ‘మురసు తుఫాన్’ ఎఫెక్ట్ - ఈ 3 రోజులు కోస్తా, సీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారిన 'మురసు'. నెల్లూరు-నర్సాపురం మధ్య అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉంది. గంటకు 120 కిమీ వేగంతో గాలులతో పాటు 3 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి.
నైరుతి, ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ‘మురసు తపాను’ కేంద్రీకృతమై ఉంది. ఇది ఇవాళ ఉదయానికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో *తీవ్ర తుపానుగా బలపడి ఆ తర్వాత వాయువ్య దిశగా ప్రయాణించనుంది. ఆపై ఇవాళ అర్ధరాత్రి–ఎల్లుండి తెల్లవారుజాము సమయంలో నెల్లూరు-నర్సాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.

మురసు తుఫాన్ తీరందాటే సమయంలో గంటకు 100 నుండి 110 కి.మీ వరకు గరిష్ఠంగా 120 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలో వేటకి వెళ్ళరాదని అధికారు హెచ్చరించారు.
ఏపీలో వర్షాలు…
తుఫాన్ ప్రభావంతో ఈ మూడురోజులు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇవాళ మధ్యాహ్నం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 80-90 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. జలు అప్రమత్తంగా ఉండాలని… అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపిఎస్జీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
నిరంతరం తుపాను పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని విపత్కర పరిస్థితుల్లో ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. తుపాను వలన ఏ సమస్య ఎదురైనా 9552300009 మన మిత్ర ద్వారా వెంటనే అధికారులకు తెలియజేయవచ్చన్నారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
సహాయక చర్యలు కోసం ముందస్తుగా కృష్ణా(2), బాపట్ల(2), గుంటూరు(2), నెల్లూరు(2), ప్రకాశం(2), మార్కాపురం(1), పల్నాడు (1), తిరుపతి (1) మొత్తంగా 6 NDRF, 7 SDRF బృందాలు మోహరింపు చేశారు. అవసరమైతే వినియోగించడానికి మరికొన్ని బృందాలు అందుబాటులో ఉన్నాయి.
- సోమవారం (02-11-2026) : ఇవాళ కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి,రెండుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడొచ్చు.
- మంగళవారం (03-11-2026) : అల్లూరి సీతారామ రాజు, పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు ఒకటి,రెండుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.
- బుధవారం (04-11-2026) : కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

