దూసుకొస్తున్న మురసు తుపాను.. భారీగా వర్షాలు.. నెల్లూరు-నరసాపురం మధ్య తీరం దాటే అవకాశం

cyclone murasu : అర్నబ్ తుపాను నుంచి ఇంకా బయటపడకముందే.. ఆంధ్రప్రదేస్ రాష్ట్రానికి మరో తుపాను ముప్పు పొంచి ఉంది. తాజాగా ఏర్పడిన మురసు తుపాను ఏపీ తీరం వైపు దూసుకొస్తుంది.

Published on: Nov 1, 2026, 16:26:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మురాసు(Murasu) తుపానుగా బలపడింది. భారత వాతావరణ శాఖ (IMD) తాజా బులెటిన్‌లో బంగాళాఖాతంలో మురసు తుపాను ఏర్పడిందని, ఇది నవంబర్ 3న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది.

మురసు తుపాను
మురసు తుపాను

భారతదేశం నామకరణం చేసిన ఈ మురసు తుపాను మరింత బలపడి అత్యంత తీవ్ర తుపానుగా మారనుంది. ఇది నవంబర్ 3 ఉదయానికి నెల్లూరు-నరసాపురం మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉంది. అప్పుడు గాలి వేగం గంటకు 100-110 కిలోమీటర్లుగా, గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

అక్టోబర్ 28న అర్నబ్ తుపాను తీరాన్ని తాకి, ఇళ్లకు నష్టం కలిగించి, చెట్లను కూల్చివేసి, పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించిన వారం లోపే ఆంధ్రప్రదేశ్ మరో తుపాను ముప్పును ఎదుర్కొంటోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన కొత్త తుపాను నవంబర్ 3, మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని సమీపించేలోపు తీవ్రమైన తుపానుగా మారే అవకాశం ఉంది.

తీరప్రాంత జిల్లాల వ్యాప్తంగా బలమైన గాలులు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించడంతో, అధికారులు సన్నాహాలను ముమ్మరం చేశారు. మురసు అంటే తమిళంలో డ్రమ్ అని అర్థం. వాతావరణ శాఖ అంచనా ప్రకారం నవంబర్ 2న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ తుపాను దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతూ మంగళవారం ఉదయం నెల్లూరు, నరసాపురం మధ్య తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది.

తుపాను కారణంగా రాబోయే మూడు రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకారం, సోమవారం, మంగళవారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆదివారం కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరులో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో సోమవారం నుంచి వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో మంగళవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సముద్రపు పరిస్థితులు ​​చాలా కఠినంగా మారే అవకాశం ఉన్నందున, బుధవారం వరకు బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని అధికారులు మత్స్యకారులకు సూచించారు. బలమైన గాలులు, భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. రాష్ట్ర యంత్రాంగం తుపాను కదలికలను పర్యవేక్షిస్తోంది. తీరప్రాంతాల్లోని ప్రజలు అధికారిక హెచ్చరికలను ఫాలో కావాలని అధికారులు కోరారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More