అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. ఈ రైళ్లు క్యాన్సిల్.. దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం!

Arnab Cyclone Cancelled Trains : అర్నబ్ తుపాను కారణంగా పలు రైళ్లు రద్దు చేసినట్టుగా రైల్వే శాఖ ప్రకటించింది. అంతేకాదు.. మరికొన్ని రైళ్లు మధ్యలో వరకు నడుస్తాయి.

Published on: Oct 26, 2026, 19:05:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

బంగాళాఖాతంలో అర్నబ్ అతి తీవ్ర తుపానుగా మారి ఏపీ, ఒడిశా తీరప్రాంతాల వైపు వేగంగా దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల అత్యవసర భద్రతను దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే పలు కీలక రైలు సర్వీసులను రద్దు చేయడంతో పాటు కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు ప్రకటించింది. తీరప్రాంతాల్లో గంటకు 100 నుండి 140 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉండటంతో, ప్రమాదాలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

అర్నబ్ ఎఫెక్ట్ రైళ్లు రద్దు
అర్నబ్ ఎఫెక్ట్ రైళ్లు రద్దు

రద్దయిన రైళ్ల పూర్తి వివరాలు

రైలు నంబర్ 18515 (విశాఖపట్నం - కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్): అక్టోబర్ 29, 2026 నుండి నవంబర్ 04, 2026 వరకు రద్దు చేశారు.

రైలు నంబర్ 18516 (కిరండూల్ - విశాఖపట్నం నైట్ ఎక్స్‌ప్రెస్): అక్టోబర్ 29, 2026 నుండి నవంబర్ 04, 2026 వరకు రద్దు అయ్యింది.

రైలు నంబర్ 58538 (విశాఖపట్నం - కొరాపుట్ ప్యాసింజర్): అక్టోబర్ 27, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు సర్వీసులు రద్దు.

రైలు నంబర్ 58537 (కొరాపుట్ - విశాఖపట్నం ప్యాసింజర్): అక్టోబర్ 28, 2026 నుండి అక్టోబర్ 31, 2026 వరకు రద్దు చేశారు.

రైలు నంబర్ 18512 (విశాఖపట్నం - కొరాపుట్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్): అక్టోబర్ 30, 2026న నడిచే సర్వీసు రద్దు.

రైలు నంబర్ 18511 (కొరాపుట్ - విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్): అక్టోబర్ 31, 2026న నడిచే సర్వీసు రద్దు చేశారు.

రైలు నంబర్ 58501 (విశాఖపట్నం - కిరండూల్ ప్యాసింజర్): అక్టోబర్ 27, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు రద్దు అయ్యింది.

రైలు నంబర్ 58502 (కిరండూల్ - విశాఖపట్నం ప్యాసింజర్): అక్టోబర్ 27, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు పూర్తిగా రద్దు చేశారు.

పలు రైళ్లలో మార్పులు

రైలు నంబర్ 18447(భువనేశ్వర్ - జగదల్‌పూర్ హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్): అక్టోబర్ 27, 2026 నుండి అక్టోబర్ 30, 2026 మధ్య బయలుదేరే ఈ రైలు రాయగడ వరకు మాత్రమే నడుస్తుంది(రాయగడలోనే నిలిపివేస్తారు).

రైలు నంబర్ 18448 (జగదల్‌పూర్ - భువనేశ్వర్ హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్): అక్టోబర్ 28, 2026 నుండి అక్టోబర్ 31, 2026 వరకు ఈ రైలు కొరాపుట్‌కు బదులుగా రాయగడ నుండే తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.

తుపాను తీవ్రత దృష్ట్యా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి రైల్వే యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణ ప్రాణాళికలను మార్చుకోవాలని సూచించింది. ప్రయాణానికి ముందు రైళ్ల సమయాలు, స్టేటస్‌ను సరిచూసుకోవడానికి ప్రయాణికులు 139కు కాల్ చేసి సమగ్ర సమాచారాన్ని పొందవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More