రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు నిష్క్రమించగా… గత కొద్దిరోజులుగా చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. అయితే వచ్చే వారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మళ్లీ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం… ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
ఇది తదుపరి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణమధ్య బంగాళాఖాతం,పశ్చిమమధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండముగా బలపడే సూచనలున్నాయి. ఈ ప్రభావంతో బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇక ఇవాళ ఏపీలోని (19-10-25) శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే సూచనున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
శనివారం సాయంత్రం 5 గంటలకు విజయనగరం(జి) నెల్లిమర్లలో 49.7 మిమీ, కృష్ణా(జి) ఘంటసాలలో 44.7 మిమీ, తిరుపతి(జి) 27.7 మిమీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.
తెలంగాణలోనూ వర్షాలు:
ఇక తెలంగాణలో నాలుగైదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం... ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి. నారాయణపేట, గద్వాల జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
{{/usCountry}}ఇక తెలంగాణలో నాలుగైదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం... ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి. నారాయణపేట, గద్వాల జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
{{/usCountry}}అక్టోబర్ 20వ తేదీన పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చు. ఇక పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి,మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్. కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.