తెలంగాణలోనూ మరికొన్ని రోజులు వర్షాలు పడనున్నాయి. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, భద్రాద్రి, వరంగల్, మహాబూబ్‌నగర్‌తోపాటుగా మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్‌లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణ, ఏపీ వర్షాలు
భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, అక్టోబర్ 20 వరకు అనేక జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన వానలు పడతాయని తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మెరుపులు, ఈదురుగాలులు రానున్నాయి. అక్టోబర్ 15, 16, 17, 18 తేదీలలో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.
అక్టోబర్ 17 నుంచి 18 వరకు ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి తదితర ఉత్తరాది జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ వారం అంతా అక్టోబర్ 14 నుంచి 18 మధ్య హైదరాబాద్‌లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా.
ఏపీలో వర్షాలు
అక్టోబర్ 14 నుండి 18 వరకు ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ మంగళవారం అంచనా వేసింది. వాతావరణ శాఖ ప్రకారం దక్షిణ తీర ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోని కొన్ని ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తీర ఆంధ్రప్రదేశ్, యానాంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
'అనేక జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.' అని ఐఎండీ తెలిపింది. అక్టోబర్ 15 నుండి 17 వరకు దక్షిణ తీర ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోని కొన్ని ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 18న ప్రధానంగా దక్షిణ తీర ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) అనేక జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వానలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు లేదా పెద్ద హోర్డింగ్‌ల దగ్గర నిలబడకుండా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
News/Telangana/అక్టోబర్ 18 వరకు ఏపీలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు.. తెలంగాణలో వాతావరణం ఇలా!
News/Telangana/అక్టోబర్ 18 వరకు ఏపీలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు.. తెలంగాణలో వాతావరణం ఇలా!