Andhra Pradesh Cyclone Alert : ఏపీకి తుపాను ముప్పు - ఈ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
బంగాళాఖాతంలోని అల్పపీడనం రూపాంతరం చెంది సోమవారానికి తుపానుగా మారనుంది. బుధవారం నాటికి కోస్తాంధ్ర తీరానికి చేరుకోనున్న నేపథ్యంలో మత్స్యకారులకు, ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
బంగాళాఖాతంలో వాతావరణ మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం అల్పపీడనంగా స్థిరపడింది. ఈ వ్యవస్థ మరింత బలపడి తీవ్ర రూపం దాల్చుతోందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.

తుపానుగా మారే ఛాన్స్….
ప్రస్తుతం కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం శనివారం రాత్రి నాటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా మారనుంది. తదనంతరం ఇది మరింత తీవ్రమై, ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా రూపం దాలుస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రయాణిస్తూ సోమవారం ఉదయానికి పశ్చిమమధ్య బంగాళాఖాతం పరిధిలోకి చేరుకుని పూర్తిస్థాయి తుపానుగా (Cyclone) మారే అవకాశముంది. తుపానుగా రూపాంతరం చెందిన తర్వాత ఇది మరింత ముందుకు కదులుతూ బుధవారం ఉదయానికి కోస్తాంధ్ర తీరానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
భారీ నుంచి అతిభారీ హెచ్చరికలు
ఈ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణంలో గణనీయమైన మార్పులు రానున్నాయి. సోమవారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా మంగళవారం, బుధవారాల్లో కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తీరప్రాంత జిల్లాల యంత్రాంగాన్ని ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తం చేసింది.
తుపాను తీవ్రత దృష్ట్యా తీరం వెంబడి గంటకు భారీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు తక్షణమే సమీప సురక్షిత తీరాలకు తిరిగిరావాలని సూచించారు.
ప్రకృతి విపత్తుల వేళ సోషల్ మీడియా వేదికగా ప్రచారమయ్యే అసత్య వార్తలు, రూమర్లను ప్రజలు తీవ్రంగా పరిగణించవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. అన్-వెరిఫైడ్ సందేశాలను ఇతరులకు షేర్ చేయకూడదని కోరారు. "ప్రజలు ఎప్పటికప్పుడు విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్టీజీఎస్ (RTGS), భారత వాతావరణ శాఖ ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. లోతట్టు ప్రాంత ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి" అని ఏపీ విపత్తుల నిర్వహణ విభాగం స్పష్టం చేసింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

