ఏపీలో దిత్వా తుపాను ప్రభావం చూపిస్తోంది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాల్లో అధికారులు సెలవు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెట్, అంగన్వాడీ పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్, జూనియర్ కాలేజీలకు డిసెంబర్ 1వ తేదీన అంటే సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు. ఈ ఉత్తర్వులు అన్ని పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు వర్తిస్తాయి.

అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించినట్టుగా జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. భారీ వర్షాల కారణంగా విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని, తల్లిదండ్రులు చూసుకోవాలని అధికారులు హెచ్చరించారు.
బీచ్‌లు బంద్
మరోవైపు దిత్వా తుపాను ఎఫెక్ట్తో పలు బీచ్‌లను అధికారులు మూసేశారు. చీరాలలోని పలు బీచ్‌లు క్లోజ్ చేశారు. డిసెంబర్ 2 వరకు సముద్ర స్నానాలు తాత్కాలికంగా నిషేధం విధించారు. బాపట్ల జిల్లాకు ఐఎండీ హెచ్చరిక ప్రకటించింది. వాడరేవు, రామాపురం, కటారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం బీచ్‌ల వద్ద ఆంక్షలు విధించారు. చీరాల బీచ్‌లకు పర్యాటకులు రావొద్దని అధికారులు సూచించారు.
తుపాను నేపథ్యంలో హంసల బీచ్ గేట్లు రెండు రోజులు పాటు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాలకాయ తిప్ప సముద్రపు కరకట్ట వద్ద ఉన్న బీచ్ గేట్లను ఈనెల 30, డిసెంబర్ 01 తేదీలలో మూసి వేస్తున్నామన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి హంసలదీవి బీచ్ వద్దకు రావద్దని సూచించారు.
హోంమంత్రి సమీక్ష
దిత్వా తుపాను నేపథ్యంలో నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రాణ నష్టం లేకుండా చూసుకోవాలని, క్షేత్రస్థాయిలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. కంట్రోల్ రూమ్‌కు వచ్చే కాల్స్‌కు వెంటనే స్పందించాలన్నారు.
'ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈదురు గాలులతో విరిగే కొమ్మలు, హోర్డింగులు వంటివాటిని వెంటనే తొలగించే ఏర్పాట్లు చేయాలి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరణ చేయాలి.' అని హోం మంత్రి అని అన్నారు.
{{/usCountry}}'ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈదురు గాలులతో విరిగే కొమ్మలు, హోర్డింగులు వంటివాటిని వెంటనే తొలగించే ఏర్పాట్లు చేయాలి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరణ చేయాలి.' అని హోం మంత్రి అని అన్నారు.
{{/usCountry}}