దిత్వా తుపాను ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!

ఆంధ్రప్రదేశ్‌లో దిత్వా తుపాను ప్రభావం కొనసాగుతోంది. దీంతో పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

Published on: Nov 30, 2025, 16:31:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీలో దిత్వా తుపాను ప్రభావం చూపిస్తోంది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాల్లో అధికారులు సెలవు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెట్, అంగన్వాడీ పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్, జూనియర్ కాలేజీలకు డిసెంబర్ 1వ తేదీన అంటే సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు. ఈ ఉత్తర్వులు అన్ని పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు వర్తిస్తాయి.

స్కూళ్లు, కాలేజీలకు సెలవు
స్కూళ్లు, కాలేజీలకు సెలవు

అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించినట్టుగా జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. భారీ వర్షాల కారణంగా విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని, తల్లిదండ్రులు చూసుకోవాలని అధికారులు హెచ్చరించారు.

బీచ్‌లు బంద్

మరోవైపు దిత్వా తుపాను ఎఫెక్ట్తో పలు బీచ్‌లను అధికారులు మూసేశారు. చీరాలలోని పలు బీచ్‌లు క్లోజ్ చేశారు. డిసెంబర్ 2 వరకు సముద్ర స్నానాలు తాత్కాలికంగా నిషేధం విధించారు. బాపట్ల జిల్లాకు ఐఎండీ హెచ్చరిక ప్రకటించింది. వాడరేవు, రామాపురం, కటారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం బీచ్‌ల వద్ద ఆంక్షలు విధించారు. చీరాల బీచ్‌లకు పర్యాటకులు రావొద్దని అధికారులు సూచించారు.

తుపాను నేపథ్యంలో హంసల బీచ్ గేట్లు రెండు రోజులు పాటు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాలకాయ తిప్ప సముద్రపు కరకట్ట వద్ద ఉన్న బీచ్ గేట్లను ఈనెల 30, డిసెంబర్ 01 తేదీలలో మూసి వేస్తున్నామన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి హంసలదీవి బీచ్ వద్దకు రావద్దని సూచించారు.

హోంమంత్రి సమీక్ష

దిత్వా తుపాను నేపథ్యంలో నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రాణ నష్టం లేకుండా చూసుకోవాలని, క్షేత్రస్థాయిలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. కంట్రోల్ రూమ్‌కు వచ్చే కాల్స్‌కు వెంటనే స్పందించాలన్నారు.

'ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈదురు గాలులతో విరిగే కొమ్మలు, హోర్డింగులు వంటివాటిని వెంటనే తొలగించే ఏర్పాట్లు చేయాలి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరణ చేయాలి.' అని హోం మంత్రి అని అన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More