RGUKT AP 2026 Admissions : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బి.టెక్ (B.Tech) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.

యూనివర్సిటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హులైన వారు మే 30వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఎంపికైన వారి జాబితా (ప్రొవిజనల్) జూన్ 12, 2026 (టెంటేటివ్)తేదీన విడుదలవుతుంది. జూలై 1, 2026 నుంచి తరగతులు షురూ అవుతాయి.
RGUKT దరఖాస్తు చేసుకునే విధానం
- అధికారిక వెబ్‌సైట్ https://admissions.rgukt.in/ లో మీ వివరాలతో నమోదు చేసుకోగానే ఒక అప్లికేషన్ నంబర్ వస్తుంది.
- ఫీజు చెల్లింపు : ఓసీ/బీసీ అభ్యర్థులు 400 రూపాయలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 250 రూపాయలు ఆన్‌లైన్ లేదా ఏపీ ఆన్‌లైన్ సెంటర్ల ద్వారా చెల్లించాలి.
- అప్లికేషన్ సమర్పణ: ఫీజు చెల్లించిన తర్వాత లాగిన్ అయ్యి మార్కుల వివరాలు, స్కూల్ వివరాలు , క్యాంపస్ ప్రిఫరెన్స్ నమోదు చేయాలి.
- డౌన్‌లోడ్: దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత ప్రింటవుట్ తీసుకుని భద్రపరుచుకోవాలి. దీనిని ఎక్కడికీ పంపాల్సిన అవసరం లేదు.
కేవలం పదో తరగతి మార్కుల మెరిట్ ఆధారంగానే ఈ అడ్మిషన్లు ఉంటాయి. ఎటువంటి ప్రవేశ పరీక్ష ఉండదు. 2026లో మొదటి ప్రయత్నంలోనే ఎస్ఎస్‌సీ (SSC) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. డిసెంబర్ 31, 2026 నాటికి అభ్యర్థి వయస్సు 18 ఏళ్ల లోపు ఉండాలి (SC/ST అభ్యర్థులకు 21 ఏళ్ల వరకు మినహాయింపు ఉంది). అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి.
గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు RGUKT ఒక ప్రత్యేక నిబంధనను అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి మార్కులకు అదనంగా 0.4 (డిప్రివేషన్ స్కోర్) కలుపుతారు. దీనివల్ల ప్రైవేట్ స్కూల్ విద్యార్థులతో పోటీ పడటం వారికి సులభం అవుతుంది.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తుకు చివరి తేదీ: మే 30, 2026 (సాయంత్రం 5 గంటల వరకు)
- ఫలితాల ప్రకటన: జూన్ 12, 2026 (తాత్కాలిక మెరిట్ జాబితా)
- ధ్రువపత్రాల పరిశీలన: జూన్ 19 నుండి జూన్ 23 వరకు (క్యాంపస్ల వారీగా ఉంటుంది)
- నూజివీడు : 19-06-2026, 20-06-2026 వరకు.
- ఆర్కే వ్యాలీ(ఇడుపులపాయ): జూన్ 19, 20 తేదీలు.
- ఒంగోలు : జూన్ 22, 23.
- శ్రీకాకుళం : జూన్ 22, 23.
- అధికారిక వెబ్ సైట్ - https://admissions.rgukt.in/