AP e-Crop Status : ఈ-పంట నమోదు చేసుకున్నారా..? మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

ఏపీ రైతులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. ఈ-పంట నమోదు చేసుకున్న వారు.. వారి స్టేటస్ తెలుసుకోవచ్చు.ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకమైన లింక్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Published on: Jan 8, 2026, 14:40:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ అన్నదాతలకు వ్యవసాయశాఖ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ఇప్పటివరకు ఈ-పంటలో రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుల వివరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఆధార్ నెంబర్ తో సులభంగా స్టేటస్ ను తెలుసుకోవచ్చని సూచించింది.

ఈ-పంట నమోదు వివరాలు
ఈ-పంట నమోదు వివరాలు

ఈ-పంట స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే..?

  1. ముందుగా https://karshak.ap.gov.in/ecrop/farmerack లింక్ పై క్లిక్ చేయాలి.
  2. ఇక్కడ క్రాప్ ఇయర్, జిల్లాను ఎంచుకోవాలి.
  3. చివరగా రైతు ఆధార్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
  4. సబ్మిట్ బటన్ పై నొక్కితే ఈ-పంట స్టేటస్ వివరాలు డిస్ ప్లే అవుతాయి.

రైతులు వ్యవసాయ సంబంధిత పథకాల రాయితీలు పొందాలన్నా.. ఉత్పత్తులు అమ్ముకోవాలన్నా ఈ-పంట నమోదు తప్పనిసరి. వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. పంట విస్తీర్ణంతో పాటు ఖాతా, సర్వే నంబర్ల వారీగా ఈ-పంట యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

అన్ని జిల్లాల్లోనూ ఈ ప్రక్రియను చేపట్టారు. ఈ- పంట నమోదు ప్రక్రియలో అధికారుల క్షేత్రస్థాయి సందర్శన ఉంటుంది. సాగు చేస్తున్న పంటతో కలిపి రైతు ఫోటోను యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఇది జియో-కోఆర్డినేట్స్‌తో అనుసంధానిస్తారు. చివరగా రైతు వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్ ద్వారా వివరాలను ధ్రువీకరిస్తారు.

సాంకేతికతతో ఈ-పంట విధానం అమలవుతోంది. మరింత కచ్చిత వివరాల నమోదుకు కృత్రిమ మేధ (ఏఐ)తో సమాచారాన్ని నిర్ధారించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం అన్ని జిల్లాలో సాగుకు సంబంధించి పంటల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసేస్తున్నారు.

ఈ-పంట నమోదుతో రైతులు అనేక ప్రయోజనాలు పొందవచ్చు. పంటల వివరాలు ఆన్‌లైన్లో నమోదైతే ప్రకృతి వైపరీత్యాల సమయంలో పెట్టుబడి రాయితీ లభిస్తుంది. ఈ-పంట సర్టిఫికెట్ తో బ్యాంకు రుణాలు మంజూరయ్యే అవకాశం ఉంటుంది. ఎరువుల సరఫరాలో కూడా ఈ వివరాలను పరిగణనలోకి తీసుకోవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More