...
...
Next Story

AP TET 2025 : ఏపీ టెట్ అభ్యర్థులకు అప్డేట్ - సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

ఏపీ టెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. నవంబర్ 23వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 10వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. అయితే ఈసారి విడుదలైన నోటిఫికేషన్ కు సంబంధించిన సిలబస్ వివరాలను వెబ్ సైట్ లో అందుబాటలోకి తీసుకువచ్చారు.

Published on: Nov 2, 2025, 05:15:19 IST
Advertisement

ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. నవంబర్ 23వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. విద్యాశాఖ తెలిపిన షెడ్యూల్ వివరాల ప్రకారం…. మాక్ టెస్ట్ ఆప్షన్ నవంబర్ 25, 2025న అందుబాటులోకి వస్తుంది. హాల్ టిక్కెట్లు డిసెంబర్ 3, 2025 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలు డిసెంబర్ 10, 2025వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.

ఏపీ టెట్ 2025 అప్డేట్స్
ఏపీ టెట్ 2025 అప్డేట్స్

టెట్ పరీక్షలో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు వీలు ఉంటుంది. అంతేకాదు ప్రైవేటు పాఠశాలల్లోనూ బోధించాలంటే టెట్ అర్హత తప్పనిసరి చేశారు. ఈ నేపథ్యంలో టెట్ 2025 పరీక్ష విధానమేంటి..? సిలబస్ కాపీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి

టెట్‌ను పేపర్‌–1ఎ, 1బి, పేపర్‌–2ఎ, 2బిల పేరుతో మొత్తం నాలుగు పేపర్లుగా నిర్వహించనున్నారు. పేపర్‌–1ఎ చూస్తే ఒకటి నుంచి అయిదో తరగతి వరకు ఉపాధ్యాయులుగా బోధించాలనుకునే వారు రాయాల్సిన పరీక్ష.. కాగా పేపర్‌–1బి అనేది ఒకటి నుంచి 5వ తరగతి వరకు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌గా పనిచేయాలనుకునే వారు రాయాల్సి ఉంటుంది.

స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూల్స్‌లో టీచర్లకు ఈ పేపర్‌ ఉత్తీర్ణత తప్పనిసరి అనే ఎన్‌సీటీఈ నిబంధనలకు అనుగుణంగా దీన్ని ప్రవేశ పెట్టారు. ఇక పేపర్‌–2ఎ చూస్తే….. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు స్కూల్‌ అసిస్టెంట్‌గా బోధించాలనుకునే వారు ఉత్తీర్ణత సాధించాల్సిన పేపర్‌ ఇది. ఇక పేపర్‌–2బి చూస్తే ఆరు నుంచి 8వ తరగతి వరకు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌గా బోధించాలనుకునే వారు అర్హత సాధించాల్సి ఉంటుంది.

పేపర్‌–2ఎ చూస్తే… ఇందులో చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి నుంచి 30 మార్కులు వస్తాయి. ఇక లాంగ్వేజ్ 1 నుంచి 30 మార్కులు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ నుంచి 30 మార్కులు, సంబంధిత సబ్జెక్ట్ నుంచి 60 మార్కులు ఇస్తారు. మొత్తం 150 మార్కులకు గానూ పరీక్ష నిర్వహిస్తారు.నాలుగో విభాగంగా నిర్వహించే సంబంధిత సబ్జెక్ట్‌ విషయంలో..మ్యాథమెటిక్స్‌ అండ్‌ సైన్స్‌ టీచర్స్‌ అభ్యర్థులు మ్యాథ్స్, సైన్స్‌ విభాగాన్ని, సోషల్‌ టీచర్లు సోషల్‌ స్టడీస్‌ విభాగాన్ని ఎంచుకుని పరీక్ష రాయాల్సి ఉంటుంది.

ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ టెట్ - 2025 సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks