AP New Chief Secretary : ఏపీ కొత్త సీఎస్‌గా సాయిప్రసాద్ - ఇవాళే బాధ్యతల స్వీకరణ

ఏపీ కొత్త సీఎస్ గా సాయి ప్రసాద్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ విజయానంద్ పదవీకాలం ఇవాళ్టితో ముగియనుంది. దీంతో కొత్త సీఎస్ గా సాయిప్రసాద్ ఇవాళ(ఫిబ్రవరి 28) బాధ్యతలు స్వీకరిస్తారు.

Published on: Feb 28, 2026, 09:45:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయి ప్రసాద్ నియమితులయ్యారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఏపీ కొత్త సీఎస్ సాయి ప్రసాద్
ఏపీ కొత్త సీఎస్ సాయి ప్రసాద్

రాష్ట్ర ప్రభుత్వం గత నవంబరు 29వ తేదీన ప్రస్తుత సీఎస్ విజయానంద్ పదవీ కాలాన్ని 3 నెలలకు పొడిగించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పదవీ కాలం ఇవాళ్టితో పూర్తి కానుంది. తదుపరి సీఎస్ గా ప్రస్తుతం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మరియు ఇఓ స్పెషల్ సీఎస్ టు సీయంగా ఉన్నసాయి ప్రసాద్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఆ మేరకు శనివారం(ఇవాళ) ఉదయం 11.33 గంటలకు సాయి ప్రసాద్ నూతన సీఎస్ గా పదవీ బాధ్యతలు చేపడతారు.

  • 1991 ఐఏఎస్ బ్యాచ్ ఏపీ క్యాడర్ కు చెందిన సాయి ప్రసాద్ ఎంటెక్ పట్టభద్రులు కాగా 1991 సెప్టెంబరు 15న ఐఏఎస్ కు ఎంపికయ్యారు.
  • 1992 జూన్ నుండి 1993 మే వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వరంగల్ అసిస్టెంట్ కలక్టర్ గా పని చేశారు.
  • 1993 సెప్టెంబరు నుండి 1995 ఏప్రిల్ వరకు పాడేరు అసిస్టెంట్ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.
  • 1995 ఆగస్టు నుండి 1997 మార్చి వరకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పని చేశారు.
  • 1997 మే నుండి 1998 ఆగస్టు వరకు కడప జాయింట్ కలెక్టర్ గా,2000 జూలై నుండి 2003 జూన్ వరకూ కర్నూల్ కలెక్టర్ గా పని చేశారు.
  • 2003 జూన్ నుండి 2003 అక్టోబరు వరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వర్తించారు.
  • 2003 అక్టోబరు నుండి 2004 ఆగస్టు వరకు ఎపి ట్రాన్సుకో జెఎండిగా,2004 ఆగస్టు నుండి 2006 మే వరకు ఇపిడిపిసిఎల్ సిఎండిగా బాధ్యతలు నిర్వర్తించారు.
  • 2006 మే నుండి 2010 ఫిబ్రవరి వరకు ఎపి సిపిడిసిఎల్ సిఎండిగా పని చేశారు.2010 ఫిబ్రవరి నుండి 2011 అక్టోబరు వరకు ఎపి హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా పని చేశారు.

2011 అక్టోబరు నుండి 2014 జూన్ వరకు కేంద్ర ప్రభుత్వ ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. తదుపరి 2014 జూన్ నుండి 2016 ఫిబ్రవరి వరకు సియం కార్యదర్శిగా.. 2016 ఫిబ్రవరి నుండి 2019 మే వరకు సియం ముఖ్య కార్యదర్శిగా పని చేశారు.

2020 జనవరి నుండి 2022 ఫిబ్రవరి వరకు ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రవేట్ లిమిటెడ్ కు సీఎండిగా, ఇంధన శాఖ ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీగాను పని చేశారు. అనంతరం 2022 ఫిబ్రవరి నుండి 2024 జూన్ వరకు సిసిఎల్ఏగా పనిచేశారు. తదుపరి 2024 జూన్ నుండి 2025 జనవరి జలవరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ….. 2025 జనవరి నుండి అదే హోదాలో పనిచేస్తూ సిఎం ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగాను సాయి ప్రసాద్ పని చేస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More