ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ట్రోపో ఆవరణంలో వీస్తున్న గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా శుక్రవారం (మే 8) కోస్తాంధ్ర మరియు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వానలు పడే అవకాశం ఉంది.
ఈ జిల్లాలకు వర్ష సూచన….

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొన్న వివరాల ప్రకారం….. రేపు(మే 8) అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం ప్రాంతం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే 9వ తేదీన కూడా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి.
ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పొలాల్లో పని చేసే రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని హెచ్చరించారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున సురక్షితమైన భవనాల్లో ఉండాలని కోరారు.
మరోవైపు వడగాలులు..
రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల వర్ష సూచన ఉండగా….. మరికొన్ని ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత కొనసాగుతోంది. అల్లూరి జిల్లాలోని జీకే వీధిమండలంలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. అలాగే ముంచింగిపుట్టు, పెదబయలు, గోకవరం, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో కూడా వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
గురువారం(ఇవాళ) రాష్ట్రంలో అత్యధికంగా పోలవరం జిల్లా వి.ఆర్.పురంలో 41.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అదే సమయంలో అల్లూరి జిల్లా గంపరైలో 21.5 మిమీ వర్షపాతం రికార్డు అయింది. భానుడి భగభగలు ఒకవైపు…. అకాల వర్షాలు మరోవైపు ఏపీ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
{{/usCountry}}గురువారం(ఇవాళ) రాష్ట్రంలో అత్యధికంగా పోలవరం జిల్లా వి.ఆర్.పురంలో 41.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అదే సమయంలో అల్లూరి జిల్లా గంపరైలో 21.5 మిమీ వర్షపాతం రికార్డు అయింది. భానుడి భగభగలు ఒకవైపు…. అకాల వర్షాలు మరోవైపు ఏపీ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
{{/usCountry}}