నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటం, దానికి తోడు ద్రోణి ప్రభావం కొనసాగుతుండటంతో రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు పలు జిల్లాలకు ముందస్తు జాగ్రత్తలు జారీ చేశారు.

వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం నాటికి వర్షాల తీవ్రత మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. కామారెడ్డి, మెదక్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ వాతావరణం వేగంగా మారుతోంది. రాబోయే కొన్ని గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) 'ఆరెంజ్ అలర్ట్' ప్రకటించింది.
APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఆరెంజ్ అలర్ట్ ప్రధానంగా కొన్ని జిల్లాలకు వర్తిస్తుంది. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు ఉంది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు, బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
ప్రజలకు అధికారుల కీలక సూచనలు
తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం ఎక్కువగా ఉన్న సమయంలో అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, పిడుగుపాట్లు, బలమైన గాలుల నుండి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదని హెచ్చరించారు.
{{/usCountry}}తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం ఎక్కువగా ఉన్న సమయంలో అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, పిడుగుపాట్లు, బలమైన గాలుల నుండి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదని హెచ్చరించారు.
{{/usCountry}}