...
...
Next Story

ఈనెల 30న బంగాళాఖాతంలో అల్పపీడనం - ఇవాళ ఈ జిల్లాలకు వర్ష సూచన

బంగాళాఖాతంలో నవంబర్ 30 నాటికి అల్పపీడనం, డిసెంబర్ 2 నాటికి వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇక ఇవాళ నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

Published on: Nov 28, 2026, 05:12:20 IST
Advertisement

దక్షిణ అండమాన్ సముద్రంపై ఏర్పడే ఉపరితల ఆవర్తన ప్రభావంతో నవంబర్ 30వ తేదీ నాటికి అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అంతేకాకుండా ఇది మరింత బలపడి డిసెంబర్ 2వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే సూచనలున్నాయి.

ఏపీకి వర్ష సూచన
ఏపీకి వర్ష సూచన

ఈ వాయుగుండం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు లేదా శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే, వివిధ వాతావరణ నమూనాలు (మోడల్స్) అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ వాయుగుండం సముద్రంలోనే బలహీనపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయని అధికారులు వివరించారు.

ఏపీకి వర్ష సూచన…

ఇవాళ (నవంబర్ 28, 2026) నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోనూ, మిగిలిన రాయలసీమ జిల్లాల్లోనూ చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడే వీలుందని పేర్కొంది.

వర్షాలు, పిడుగుల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్‌డీఎంఏ సూచించింది. బయట తిరిగేవారు, రైతులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు.

 

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks