...
...
Next Story

ఐఎండీ వెదర్ రిపోర్ట్ : ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణం..!

ఏపీకి ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ద్రోణి ప్రభావంతో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ఇక తెలంగాణలో మాత్రం పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

Published on: Nov 7, 2025, 10:34:33 IST
Advertisement

ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ద్రోణి ప్రభావంతో ఇవాళ పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. కొన్నిచోట్ల పిడిగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడుతాయని పేర్కొంది.

తెలంగాణ, ఏపీ వెదర్ రిపోర్ట్
తెలంగాణ, ఏపీ వెదర్ రిపోర్ట్

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం… శుక్రవారం(నవంబర్ 07, 2025) కోనసీమ, పశ్చిమగోదావరి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా చోట్ల పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది.

ఇక రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే సూచలున్నాయి. ఇక రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చు. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

తెలంగాణలో పొడి వాతావరణం:

మరోవైపు తెలంగాణకు ఎలాంటి వర్ష సూచన లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ్టి నుంచి పూర్తిగా పొడి వాతావరణమే ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ వారమంతా కూడా పొడి వాాతావరణమే ఉంటుందని… ఎలాంటి వర్ష సూచన లేదని పేర్కొంది. ఇక హెచ్చరికలు కూడా లేవని స్పష్టం చేసింది.

ఇక హైదరాబాద్ వాతావరణం చేస్తూ… ఆకాశం పాక్షికంగా మేఘావృత్తమై ఉంటుంది. రాత్రి వేళల్లో పొగమంచు లేదా మబ్బుతో కూడిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల గాలులు ఉత్తర, ఈశాన్య దిశలో గంటకు 04- 08 కిమీ వేగంతో వీస్తాయని వివరించింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks