...
...
Next Story

AP Weather Report : ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు - ఈ ప్రాంతాలకు ఈదురుగాలుల హెచ్చరికలు

Andhrapradesh Weather Updates : ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. గంటకు 50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Published on: Jul 30, 2026, 09:54:16 IST
Advertisement

Andhrapradesh Weather Updates : ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈ జిల్లాల్లో వర్షాలు…

ఏపీకి వర్ష సూచన
ఏపీకి వర్ష సూచన

ఇవాళ(జూలై 30) పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటితో పాటు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లోనూ వానలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.

ఈదురుగాలుల హెచ్చరికలు..

మరోవైపు రాయలసీమ ప్రాంతాలైన మార్కాపురం, నెల్లూరు, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే వీలుంది. ఈదురుగాలుల ముప్పు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలువర్షం పడే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.

"వర్షం పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి" అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో…. వర్షం పడే సమయంలో చెట్ల కింద గానీ, ఎత్తైన విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్‌ల వద్ద గానీ నిలబడకూడదు. బలమైన గాలుల వల్ల విద్యుత్ తీగలు తెగిపడే ప్రమాదం ఉంది. రోడ్లపై తెగిపడిన విద్యుత్ వైర్లను గమనిస్తూ…. వాటికి వీలైనంత దూరంగా ఉండాలి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe