నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది శ్రీలంకకి తూర్పు ఈశాన్యందా 160 కి.మీ, పుదిచేరికి ఆగ్నేయంగా 540 కిమీ. చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 710 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఇది జనవరి 10వ తేదీన వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర శ్రీలంక తీరాన్ని మధ్యాహ్నం సమయంలో దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఏపీకి వర్ష సూచన..
- అమరావతి వాతావరణ కేంద్రం బులిటెన్ ప్రకారం... ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు పొడి వాతావరణం, పొగమంచు వాతావరణ పరిస్థితులుంటాయి.
- దక్షిణ కోస్తాలో ఇవాళ పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే సూచనలున్నాయి.
- రాయలసీమ ప్రాంతంలో ఇవాళ కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి కూడా ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు.
- రాగల 5 రోజుల్లో కోస్తాంధ్రా, యానాం, రాయలసీమ కనిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పులు ఉండకపోవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఇక తెలంగాణలో చూస్తే పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం... రాబోయే 2 రోజుల్లో అక్కడకక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉండే సూచనలున్నాయి. ఎలాంటి హెచ్చరికలు లేవు.
ప్రస్తుతం తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగానే ఉంటోంది. పలు చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. హైదరాబాద్ సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటోంది. ఉదయం సమయాల్లో పొగమంచు ఎక్కువగా ఉండటంతో... వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే సంక్రాంత్రి తర్వాత చలి తీవ్రత క్రమంగా తగ్గే సూచనలున్నాయి.