అమరావతి : రైతులకు గుడ్‌న్యూస్.. ఈ తేదీలోపు తీసుకున్నవారికి రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ
అమరావతి రైతులకు మంత్రి నారాయణ గుడ్‌న్యూస్ చెప్పారు. రుణమాఫీ చేయనున్నట్టుగా ప్రకటించారు. రాజధాని భూమిని వేగంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
తుళ్లూరు మండలం వడ్లమాను గ్రామంలో రాజధాని ప్రాంతానికి సంబంధించిన రెండో దశ భూ సమీకరణ ప్రక్రియను అధికారికంగా మంత్రి నారాయణ ప్రారంభించారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం సేకరించిన భూమిని వేగంగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా సముదాయంతో సహా కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను రాబోయే మూడేళ్లలో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు.

'రాజధాని ప్రాంతంలోని రైతులకు రుణమాఫీ ఉపశమనం కోసం స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అభ్యర్థించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నేను మాట్లాడాను. ఆయన ఈ ప్రతిపాదనకు అంగీకరించారు. జనవరి 6 వరకు అర్హత కలిగిన రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తాం. ఈ ప్రయోజనం రూ.1.5 లక్షల వరకు ఉన్న రుణాలకు వర్తిస్తుంది.' అని మంత్రి నారాయణ ప్రకటించారు.
అమరావతిలో రెండో విడత భూసేకరణ ప్రక్రియను ప్రారంభమైంది. ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ చేసిన 34వేల ఎకరాల భూమిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. 4026 అధికారుల భవనాల నిర్మాణంలో వేగం పుంజుకుంది. 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు పనులు నిర్ణయించుకున్న గడువులోపు పూర్తి చేసే దిశగా సీఆర్డీఏ అడుగులు వేస్తోంది.
రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీల నిర్మాణం కోసం 7 గ్రామాల్లో దశలవారీగా రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ అనంతరం ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన పనులు ప్రారంభిస్తారు. వీటిలో ముఖ్యంగా రెండు వరుసల రహదారులు, అండర్ గ్రౌండ్ కేబుల్స్, వాటర్ లైన్స్ తదితర ఏర్పాట్లు చేస్తారు.
వడ్డమాను, హరిచంద్రాపురం, పెద్దపరిమి గ్రామాల పరిధిలోని 9097.56 ఎకరాల పట్టాభూమి, 7.01ఎకరాల అసైన్డ్ భూమి, అదేవిధంగా పల్నాడు జిల్లాలోని నాలుగు గ్రామాల్లో మొత్తం 7465 ఎకరాలు పట్టా భూమి, 97 ఎకరాల అసైన్డ్ మొత్తంగా 16,666.57 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తారు.
రైతులకు ఇచ్చే ప్లాట్లు, మౌలిక వసతుల కల్పన తదుపరి మిగిలిన 2500 ఎకరాల భూమిలో స్పోర్ట్స్ సిటీ, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్‌కు వినియోగిస్తారు. ప్రస్తుతం వైకుంఠపురం, పెద్దమద్దూరు, యండ్రాయి, కర్లపూడి గ్రామాల్లో నోటిపికేషన్ ప్రకటించారు. ఈ నాలుగు గ్రామాల్లో 9500 ఎకరాల్లో రెవెన్యూ ల్యాండ్ ఉంది. రైతులకు చెందిన భూమి 7500 ఎకరాలు ఉంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


