తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు గాలుల ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్, యానాం పరిసరాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీలో వర్షాలు…

అమరావతి వాతావరణ కేంద్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం…. రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు, ఈదురుగాలుల ప్రభావం కనిపించనుంది.
- ఇవాళ కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. కొన్నిసార్లు గాలి వేగం గరిష్టంగా 50 కిలోమీటర్లకు చేరుకోవచ్చు. ఉదయం వేళల్లో పొగమంచు కురిసే సూచనలు ఉన్నాయి.
- రేపు, ఎల్లుండి కూడా కోస్తాంధ్ర, యానాంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ. (గరిష్టంగా 50 కి.మీ.) వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. పొగమంచు ప్రభావం కొనసాగుతుంది.
రాయలసీమలో చూస్తే… సోమవారం (నవంబర్ 23) ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉరుములు, మెరుపులు సంభవించడంతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ., గరిష్టంగా 50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయి. పలుచోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉంది.
రాగల రెండు రోజులు రాయలసీమలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. గంటకు 50 కి.మీ. గరిష్ట వేగంతో ఈదురుగాలులు, ఉదయం పూట పొగమంచు ఏర్పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
తెలంగాణకు వర్ష సూచన :
{{/usCountry}}రాగల రెండు రోజులు రాయలసీమలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. గంటకు 50 కి.మీ. గరిష్ట వేగంతో ఈదురుగాలులు, ఉదయం పూట పొగమంచు ఏర్పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
తెలంగాణకు వర్ష సూచన :
{{/usCountry}}తెలంగాణలో రెండ్రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుంది.
- నవంబర్ 24, 25 తేదీల్లో తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే… ఎలాంటి భారీ వర్ష హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
- నవంబర్ 26 నుంచి 29 వరకు… రాష్ట్రంలో మళ్లీ పూర్తిగా పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
- ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, ఈదురుగాలుల సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ABOUT THE AUTHOR
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.