...
...
Next Story

గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు : ఎస్ఐ‌పీబీ సమావేశంలో చంద్రబాబు

డిసెంబర్ నుంచి పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎంత మేరకు ప్రోత్సాహకాలను అందించగలమో నిర్ధారించడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు.

Published on: Aug 12, 2026, 18:39:19 IST
Advertisement

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, ఆర్థిక పురోగతి లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 20వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(SIPB) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ. 2,08,406 కోట్ల విలువైన 25 భారీ పెట్టుబడి ప్రతిపాదనలకు ఈ సమావేశంలో బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 21,627 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో పరిశ్రమలను మరింత ప్రోత్సహించేందుకు డిసెంబర్ నుంచి పారిశ్రామిక ప్రోత్సాహకాలను నేరుగా 'ఎస్క్రో ఖాతాల' (Escrow Accounts) లోకి జమ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూనే, ప్రాక్టికల్‌గా ఎంత మేరకు ప్రోత్సాహకాలు ఇవ్వగలమో నిర్ణయించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా ఆయా ప్రాంతాల సమగ్ర వికాసానికి బాటలు వేయాలని తెలిపారు.

సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

గ్రీన్ అమ్మోనియా, లిథియం బ్యాటరీలు, రోబోటిక్స్ వంటి భవిష్యత్ సాంకేతిక రంగాలలో కొత్త పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం సూచించారు.

శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు నిర్మాణ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసి, అదే నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కులు అందుబాటులోకి వచ్చేలా మిగిలిన 37 MSME పార్కుల నిర్మాణాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ నాటికల్లా పూర్తి చేయాలని గడువు విధించారు.

వన్ ఫ్యామిలీ - వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేపట్టాలని పిలుపునిచ్చారు.

దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి

విశాఖపట్నంలోని పరిశ్రమలకు పొలవరం ఎడమ కాలువ నుంచి గ్రావిటీ ఫ్లో ద్వారా పుష్కలంగా నీటిని అందిస్తామని స్పష్టం చేశారు. పుట్టపర్తి సమీపంలో డిఫెన్స్ ప్రాజెక్టులు, హిందూపూర్ సమీపంలో ఏరోస్పేస్ ప్రాజెక్టుల ఏర్పాటును వేగవంతం చేయాలని తెలిపారు.రాయలసీమ ప్రాంతపు ఉద్యాన ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లకు చేరేలా రోడ్డు, రైలు మరియు పోర్టు కనెక్టివిటీని బలోపేతం చేయాలని నిర్దేశించారు.

రాష్ట్రంలో నిర్మించే హోటళ్లు, పర్యాటక ప్రాజెక్టులు ప్రత్యేకమైన విశిష్ట నిర్మాణ శైలి కలిగి ఉండి పర్యాటకులను ఆకట్టుకునేలా ఉండాలని సూచించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks