జులై 20వ తేదీన ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం టూర్.. మిడిల్ క్లాస్ బడ్జెట్!

IRCTC Tour Package : సౌత్ ఇండియాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు దర్శించాలా? ఐఆర్‌సీటీసీ మీకోసం దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం పేరుతో టూర్ ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ విషయాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jul 10, 2026, 12:42:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దక్షిణ భారతదేశంలోని ప్రముఖమైన ఆలయాల సందర్శన వెళ్లాలనుకునేవారికి గుడ్‌న్యూస్. ఐఆర్‌సీటీసీ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీని రన్ చేస్తోంది. ఆసక్తి ఉన్నవారు బడ్జెట్ ధరలోనే పుణ్యక్షేత్రాలు దర్శించుకుని రావొచ్చు. దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం పేరుతో ఈ టూర్ ఐఆర్‌సీటీసీ ఆపరేట్ చేస్తోంది. తక్కువ ఖర్చులోనే ప్రముఖ ఆలయాలను సందర్శించి రావొచ్చు.

ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం టూర్ (HT Telugu)
ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం టూర్ (HT Telugu)

8 రాత్రులు, 9 రోజుల టూర్ ఇది. జులై 20వ తేదీన ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, చర్లపల్లి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి జంక్షన్, ఒంగోలు, నెల్లూరు, గుడూరు జంక్షన్, రేణిగుంట జంక్షన్‌ దగ్గర రైలు ఎక్కవచ్చు. ఈ టూర్‌లో భాగంగా అరుణాచలం దర్శనం కూడా ఉంటుంది.

సందర్శించే ఆలయాలు

తిరువణ్ణామలై (అరుణాచలం): ప్రసిద్ధ అరుణాచలేశ్వర ఆలయ దర్శనం.

చిదంబరం: అద్భుతమైన నటరాజ స్వామి దేవాలయం.

తిరుచ్చి (తిరుచిరాపల్లి): శ్రీరంగనాథస్వామి ఆలయ సందర్శన.

తంజావూరు: చారిత్రక బృహదీశ్వర ఆలయం.

రామేశ్వరం: పవిత్రమైన శ్రీ రామనాథస్వామి జ్యోతిర్లింగ దర్శనం.

మధురై: మీనాక్షి అమ్మవారి ఆలయం.

కన్యాకుమారి: భగవతి అమ్మన్ ఆలయం, వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపం.

ప్యాకేజీ ధరలు

జులై 20 నుంచి జులై 28 వరకు ప్రయాణం ముగుస్తుంది. ప్యాకేజీ ధరల వివరాలు ప్రయాణీకులు ఎంచుకునే క్లాస్‌ను బట్టి టికెట్ ధరలు ఉన్నాయి. పెద్దలకు ఎకానమీ(స్లీపర్ క్లాస్) రూ.15,600, పిల్లలకైతే రూ.14,600, అదే స్టాండర్డ్ (3 AC) పెద్దలకు రూ.23,100, పిల్లలకు రూ.21,900, కంఫర్ట్ (2 AC) పెద్దలకు రూ.29,900, పిల్లలకు రూ.28,100గా ఉంది.

ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం (శాకాహారం మాత్రమే) ఉంటుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్, ఫ్రెండ్లీ టూర్ ఎస్కార్ట్‌ల సేవలు ఉంటాయి. అవసరమైన సహాయం కోసం ఐఆర్‌సీటీసీ టూర్ మేనేజర్లు పర్యటన మెుత్తం మీతో ఉంటారు. భక్తులు ఈ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకుని దక్షిణ భారతదేశ పుణ్యక్షేత్రాలను సులభంగా దర్శించుకోవచ్చు. పూర్తి వివరాలు, బుకింగ్స్ కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ irctctourism.com ను సందర్శించండి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More