మిడిల్ క్లాస్ బడ్జెట్‌లో ఐఆర్‌సీటీసీ అనేక టూరిస్ట్ ప్యాకేజీలు అందిస్తుంది. మీరు కూడా తక్కువ ధరలోనే ఉత్తరాంధ్రకు వెళ్లి రావాలంటే మీ కోసం మంచి ఆప్షన్ ఉంది. కిర్రాక్ బీచ్‌లు, ప్రకృతి అందాలు, కొండలు, ఆలయాలు చూసి రావొచ్చు. వైజాగ్ రీట్రీట్ పేరుతో ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా విశాఖపట్నం, అరకు, సింహాచలం చూసి రావొచ్చు. ఈ టూర్ నవంబర్ 17న అందుబాటులో ఉంది. మూడు రోజులు, రెండు రాత్రుల ప్యాకేజీ ఇది.
ఫస్ట్ డే

విశాఖపట్నం విమానాశ్రయం, రైల్వే స్టేషన్, బస్టాండ్‌కు వచ్చిన టూరిస్టులను పికప్ చేసుకుని హోటల్‌కు తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్ ఇన్ చేయాలి. ఫ్రెష్ అప్ అయిన తర్వాత లంచ్ వరకు విశ్రాంతి తీసుకోవచ్చు. భోజనం తర్వాత తొట్లకొండ బౌద్ధ ఆలయాలు, కైలాష్ గిరి, రుషికొండ బీచ్ తీసుకెళ్తారు. సాయంత్రం తిరిగి హోటల్‌కి వస్తారు. రాత్రికి విశాఖపట్నంలో బస చేయాలి.
సెకండ్ డే
బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఉదయం 08:00 గంటలకు అరకు బయలుదేరతారు. టైడా జంగిల్ బెల్స్, పద్మాపురం గార్డెన్స్ , ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్ , గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలు సందర్శిస్తారు. మీ డబ్బులతోనే లంచ్ చేయాల్సి ఉంటుంది. సాయంత్రం తిరిగి విశాఖపట్నం చేరుతారు.
థర్డ్ డే
అల్పాహారం తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అవ్వాలి. సింహాచలం సందర్శించడానికి వెళ్తారు. సింహాచలం సందర్శించిన తర్వాత తిరిగి విశాఖపట్నం వస్తారు. మీ డబ్బులతోనే లంచ్ చేయాలి. తర్వాత సబ్‌మెరైన్ మ్యూజియం సందర్శించాలి. బీచ్ రోడ్ లో డ్రైవ్ చేస్తారు. విశాఖపట్నం విమానాశ్రయం, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ వద్ద పర్యాటకులను డ్రాప్ చేస్తారు.
ఈ ప్యాకేజీలో భాగంగా రెండు రోజుల వసతి, పికప్, డ్రాప్ ఈ ప్యాకేజీలో ఉంటాయి. అల్పాహారం (రోజు 02 , రోజు 03) + డిన్నర్ (రోజు 01, రోజు 02) అందిస్తారు. ఏసీ వాహనంలో ప్రయాణం ఉంటుంది. ఇన్సూరెన్స్, జీఎస్టీ ఉంటాయి.
ధరలు
ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే కంఫర్ట్ క్లాస్‌లో ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.8055, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.11075, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.20125గా నిర్ణయించారు. 5 - 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. విత్ బెడ్ రూ.6750, వితౌట్ బెడ్ రూ.4415గా ధరలు ఉన్నాయి https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ తో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
{{/usCountry}}ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే కంఫర్ట్ క్లాస్‌లో ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.8055, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.11075, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.20125గా నిర్ణయించారు. 5 - 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. విత్ బెడ్ రూ.6750, వితౌట్ బెడ్ రూ.4415గా ధరలు ఉన్నాయి https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ తో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
{{/usCountry}}