Navodaya Admissions 2027 : నవోదయలో 6వ తరగతి అడ్మిషన్లు - అప్లికేషన్ ఎడిట్ కు ఛాన్స్! ఇవాళే చివరి తేదీ
JNVST 2027 Application Correction : నవోదయ విద్యాలయాల్లో6వ తరగతి ప్రవేశాల దరఖాస్తు సవరణ విండో అందుబాటులోకి వచ్చింది. ఇవాళ్టితో(ఆగస్ట్ 12) గడువు ముగియనుంది.
JNVST 2027 Application Correction : దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రెన్స్ పరీక్షకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. దరఖాస్తుల సవరణ (Correction Window) ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది.

ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువు ఆగస్టు 10వ తేదీతో పూర్తయిన నేపథ్యంలో…. విద్యార్థులు తమ దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి నవోదయ విద్యాలయ సమితి అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఆగస్ట్ 12వ తేదీలోపు తమ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్( https://cbseitms.rcil.gov.in/nvs/Edit ) ద్వారా కరెక్షన్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 15 జవహర్ నవోదయ విద్యాలయాలు అందుబాటులో ఉన్నాయి. ఉచిత నాణ్యమైన విద్యకు నిలయమైన ఈ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం ప్రతీ ఏటా లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడుతుంటారు. ఈ ఎంపిక పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత బోధనతో పాటు, బాలబాలికలకు వేర్వేరుగా నాణ్యమైన వసతి, భోజన సౌకర్యాలు సంపూర్ణ ఉచితంగా కల్పిస్తారు.
నవంబర్ 28న ఎగ్జామ్….
జేఎన్‌వీఎస్టీ-2027 ప్రవేశ పరీక్షను 2026 నవంబర్ 28న నిర్వహించనున్నారు. ఈ పరీక్షా విధానం పూర్తిగా బహుళైచ్ఛిక (MCQ) రూపంలో ఉంటుంది. మొత్తం 100 మార్కులకు గాను 80 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష రాసేందుకు 2 గంటల వ్యవధి కేటాయించారు. ప్రశ్నపత్రంలో ప్రధానంగా మూడు విభాగాలు ఉంటాయి.
ఈ ప్రవేశ పరీక్షలో విద్యార్థులు కనబరిచిన ప్రతిభ, సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి సీట్లను కేటాయిస్తారు. పరీక్షకు సంబంధించిన ఫలితాలు 2027 మార్చి చివరి వారంలో వెలువడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
జవహర్ నవోదయ విద్యాలయాల్లో సీటు వచ్చిన విద్యార్థి.. ఆరో తరగతి నుంచి 12వ తరగతి దాకా చదువుకునేందుకు మంచి అవకాశం ఉంటుంది. ఇక్కడ చదువుతోపాటుగా గేమ్స్, సమగ్ర వికాసానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కోదాంట్లో గరిష్టంగా 80 మంది విద్యార్థుల వరకు ఆరో తరగతిలో అడ్మిషన్ ఉంటుంది.
ప్రవేశానికి గుర్తించిన 80 మంది విద్యార్థుల్లోనూ 75 శాతం గ్రామీణ, 25 శాతం పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు. ఇందులో 15 శాతం ఎస్సీ, 7.5 శాతం ఎస్టీ, 3 శాతం దివ్యాంగులకు, బాలికలకు 1/3 వంతు రిజర్వేషన్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

