వందే భారత్ ట్రైన్ సేవలను క్రమంగా విస్తరిస్తున్నారు. ఇటీవలనే ఏపీలోని నర్సాపురం వరకు ట్రైన్ సేవలను పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా రైల్వేశాఖ మరో శుభవార్తను అందించింది.కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య నడిచే వందేభారత్ ట్రైన్ ఇక నుంచి హిందూపూర్‌లో కూడా ఆగనుంది. డిసెంబర్ 27వ తేదీ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది.

కాచిగూడ–యశ్వంత్‌పూర్ (ట్రైన్ నెంబర్ 20703) మధ్యాహ్నం 12.08 గంటలకు హిందూపూర్ చేరుకుని 12.10 గంటలకు బయల్దేరనుంది. అంటే 2 నిమిషాలపాటు ఈ స్టేషన్ లో ఆగనుంది. తిరుగు ప్రయాణంలో అదే స్టేషన్‌లో రైలు నెంబర్ 20704(యశ్వంత్‌పూర్–కాచిగూడ) మధ్యాహ్నం 3.48 నుంచి 3.50 గంటల వరకు ఆగుతుంది. ఈ హాల్టింగ్ సౌకర్యంతో…. హిందూపూర్ ప్రాంతంలోని ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించటమే లక్ష్యమని రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు.
ఇక కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వారంలో 6 రోజులు రాకపోకలు సాగిస్తుంది. బుధవారం ఒక్క రోజు ఉండదు. ప్రతి రోజూ ఉదయం 5.45 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరి.. కాచిగూడ రాత్రి 11 గంటలకు చేరుతుంది.
ఈ ట్రైన్ మహబూబ్‌నగర్, కర్నూల్, అనంతపురం, ధర్మవరం, హిందూపురం మీదుగా యశ్వంతపూర్ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. హిందూపురంలో స్టాప్ రావటంతో స్థానిక ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది.
ఈ రూట్ లో డైలీ ప్యాసింజర్ ట్రైన్:
ఇక గుంతకల్లు - మార్కాపుర్ మధ్య డైలీ ప్యాసింజర్ రైలు అందుబాటులోకి రానుంది .ప్రతీ రోజూ ప్రయాణించే ఈ రైలు నంద్యాల మీదుగా వెళ్లనుంది. ఈ ట్రైన్ సేవలు త్వరలో అందుబాటు లోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
{{/usCountry}}ఇక గుంతకల్లు - మార్కాపుర్ మధ్య డైలీ ప్యాసింజర్ రైలు అందుబాటులోకి రానుంది .ప్రతీ రోజూ ప్రయాణించే ఈ రైలు నంద్యాల మీదుగా వెళ్లనుంది. ఈ ట్రైన్ సేవలు త్వరలో అందుబాటు లోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
{{/usCountry}}గుంతకల్లు - మార్కాపుర్ (ట్రైన్ నెబంర్ 57407) మధ్య రోజువారీ ప్యాసింజర్ రైలు సర్వీస్ అందుబాటులో ఉండనుంది. ఈ రైలు… సాయంత్రం 5.30 గంటలకు గుంతకల్లు నుంచి బయల్దేరి… రాత్రి 11.30 గంటలకు మార్కాపుర్ రోడ్ స్టేషన్ కు చేరుకుంటుంది. ఇది మధ్యలో నంద్యాలలో రాత్రి 8.30కి ఆగనుంది.
అంతేకాకుండా మార్కాపుర్ రోడ్ నుంచి గుంతకల్లుకు (ట్రైన్ నెంబర్ 57408) మధ్య ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఇది మార్కాపూర్ రోడ్ నుంచి ఉదయం 10.30కు బయలుదేరుతుంది. సాయంత్రం 4.30కు గుంతకల్లుకు చేరుకోనుంది. ఈ రైలు నంద్యాలలో ఉదయం 7.20కి ఆగనుంది.
ఈ డైలీ ప్యాసింజర్ రైళ్లు…. మద్దికెర, పెండేకల్లు, ధోన్ , రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమెట్ట, గిద్దలూరు, సోమిదేవిపల్లె, జగ్గంభొట్ల కృష్ణాపురం, కంబం, తర్లుపాడు స్టేషన్లలో ఇరు వైపు ప్రయాణంలో ఆగుతాయి.