ఆంధ్రప్రదేశ్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGBV) ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు విద్యాశాఖ పెద్ద ఉపశమనం కలిగించింది. గతంలో విడుదల చేసిన 299 కాంట్రాక్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్‌లో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేసింది. అభ్యర్థులకు అత్యంత కీలకమైన టెట్(TET) నిబంధన నుండి తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ (SPD) బి.శ్రీనివాసరావు అధికారిక ప్రకటన విడుదల చేశారు. సవరించిన తాజా నిబంధనలు, దరఖాస్తు ప్రక్రియతో చాలా మందికి ఉపశమనం దక్కుతుంది.

సాధారణంగా కేజీబీవీల్లో ఉపాధ్యాయ పోస్టులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) తప్పనిసరి. అయితే తాజా సవరణ ప్రకారం ప్రస్తుతం టెట్ క్వాలిఫై కాకపోయినా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ మినహాయింపు తాత్కాలికం మాత్రమే అని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరిన రోజు నుండి ఏడాదిలోపు కచ్చితంగా ఏపీ టెట్ (AP TET) అర్హత సాధించాలి.
ఒకవేళ నిర్ణీత కాలంలోగా టెట్ అర్హత సాధించలేకపోతే, ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే వారి ఉద్యోగం నుండి తొలగిస్తారు. మే 25న విడుదలైన ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే సమయాన్ని అధికారులు జూన్ 20 వరకు పొడిగించారు. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇదివరకు ఇప్పటికే అప్లై చేసుకున్న అభ్యర్థులు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 299 పోస్టులను భర్తీ చేయనున్నారు. సీఆర్‌టీ(CRT)133, పీజీటీ (PGT) 98, పీఈటీ (PET)52, ప్రిన్సిపాల్స్ (Principals) 16 ఖాళీలు ఉన్నాయి.
ఈ పోస్టులకు సంబంధించిన వయోపరిమితి, విద్యార్హతలు, వేతన ప్యాకేజీ, ఇతర పూర్తి వివరాలను సమగ్ర శిక్ష అధికారిక వెబ్సైట్లో పరిశీలించవచ్చు. ఒకవేళ ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పించేటప్పుడు అభ్యర్థులకు ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే, తక్షణ సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు. 70750 39990, 79933 29115 కాల్ చేయవచ్చు.
{{/usCountry}}ఈ పోస్టులకు సంబంధించిన వయోపరిమితి, విద్యార్హతలు, వేతన ప్యాకేజీ, ఇతర పూర్తి వివరాలను సమగ్ర శిక్ష అధికారిక వెబ్సైట్లో పరిశీలించవచ్చు. ఒకవేళ ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పించేటప్పుడు అభ్యర్థులకు ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే, తక్షణ సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు. 70750 39990, 79933 29115 కాల్ చేయవచ్చు.
{{/usCountry}}టెట్ లేదనే కారణంతో ఇంతవరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశం. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఆలస్యం చేయకుండా జూన్ 20 లోపు తమ దరఖాస్తులను సమర్పించుకోవాల్సిందిగా అధికారులు సూచించారు.