ఆంధ్రా యూనివర్సిటీ నుంచి అప్డేట్.. అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రా విశ్వవిద్యాలయం తన అనుబంధ కళాశాలలు, పాఠశాలలలో 2026-27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక బోధనా ఏర్పాట్ల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఒక ప్రకటనను జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా రంగంలో ప్రముఖ విద్యాసంస్థ అయిన విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ (AU) నిరుద్యోగ అభ్యర్థులకు తీపి కబురు అందించింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను వర్సిటీ పరిధిలోని వివిధ అనుబంధ కళాశాలలు, పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన అధ్యాపక పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ నియామకాలు పూర్తిగా సెమిస్టర్ ప్రాతిపదికన ఉంటాయి. యూనివర్సిటీలోని వివిధ అకడమిక్ విభాగాల్లో బోధనా పనులను నిర్వహించడానికి ఈ తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ కాలేజీల్లో ఖాళీల భర్తీ
ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని క్రింది ప్రముఖ కళాశాలల్లో ఈ తాత్కాలిక అధ్యాపక పోస్టులను భర్తీ చేయనున్నారు:
ఏయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్
ఏయూ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ - అటానమస్
ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ - ఉమెన్
ఏయూ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా
ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్
ఈ పోస్టులు కేవలం తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే భర్తీ అవుతున్నాయి. భవిష్యత్తులో రెగ్యులర్ పోస్టులుగా కొనసాగించడానికి ఎటువంటి హక్కులు ఉండవని వర్సిటీ వర్గాలు స్పష్టం చేశాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన విద్యార్హతలు, సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ (ఇంటర్వ్యూ షెడ్యూల్) గురించిన పూర్తి వివరాలను ఆంధ్రా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ andhrauniversity.edu.in లో అందుబాటులో ఉంచారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఉన్నత విద్యా రంగంలో, ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైన ఏయూలో బోధనా అనుభవం సంపాదించాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశంగా చెప్పవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


