వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకంలో కీలక మార్పు.. పాత పద్ధతికి గుడ్‌బై!
appsc veterinary assistant surgeon : వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక మార్పు చేసింది. పాత పద్ధతికి గుడ్‌బై చెప్పింది. పరీక్షకు తప్పనిసరి హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్(Veterinary Assistant Surgeon) ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఇప్పటివరకు కొనసాగుతున్న పాత విధానానికి స్వస్తి పలికింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకంలో మార్పు
{{^htLoading}} {{/htLoading}}
గతంలో ఉన్న నిబంధనల ప్రకారం అకడమిక్ మార్కులు, ఉన్నత విద్య, సర్వీస్ అనుభవం, గ్రాడ్యుయేషన్ తర్వాత ఉన్న సీనియారిటీ ఆధారంగా (వెయిటేజ్ పద్ధతిలో) ఎంపిక చేపట్టాలని ఈ నెల 13, 14 తేదీల్లో ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, తాజాగా ఆ ఉత్తర్వులను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం.
తాజా నిర్ణయంతో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి APPSC నిర్వహించే రాత పరీక్షే ఏకైక ప్రామాణికంగా మారనుంది. గతంలో మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుందని భావించిన అభ్యర్థులు, ఇప్పుడు మారిన నిబంధనల ప్రకారం రాత పరీక్షకు సిద్ధం కావాల్సి ఉంటుంది.
ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ వెలువడిన అనంతరం అధికారికంగా దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష తేదీల ప్రక్రియ ప్రారంభమవుతుంది. చాలాకాలంగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ కొలువుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ మార్పును గమనించి తమ ప్రిపరేషన్ ప్రణాళికను మార్చుకోవాలని ప్రభుత్వం సూచించింది. పారదర్శకతను పెంచేందుకే రాత పరీక్ష విధానాన్ని పునరుద్ధరించినట్లు తెలుస్తోంది.
మరోవైపు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఊరటనిస్తూ ప్రభుత్వం గ్రూప్-1 కేటగిరీ పోస్టులతో పాటు పలు శాఖల్లో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే పోలీస్ శాఖలో కూడా 2,050 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రసుతం వెటర్నరీ పోస్టులకు సంబంధించి ఏపీపీఎస్సీ నుంచి పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల కాగానే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.