...
...
Next Story

మున్సిపల్‌ షాపుల అద్దె వ్యవస్థలో కీలక మార్పులు.. పై అంతస్థుల్లోని షాపులకు అద్దె తగ్గింపు

Municipal Shop Rent Policy : మున్సిపల్‌ షాపుల అద్దె వ్యవస్థలో కీలక మార్పులు జరిగాయి. అద్దెలు ఒక్కసారిగా భారీగా పెరగడం కారణంగా వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు.

Published on: May 2, 2026, 13:54:03 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపాలిటీ అద్దె వ్యవస్థలో మార్పులు చేసింది. రాబడి వసూళ్లను మెరుగుపరచడానికి, గతంలో ఉన్న అధిక పెంపుల స్థానంలో ఒక మోస్తరు వార్షిక పెంపును ప్రవేశపెట్టింది. మున్సిపల్ అద్దె విధానంలో సవరణలు చేసింది.

మున్సిపల్ షాపు అద్దె పాలసీ
మున్సిపల్ షాపు అద్దె పాలసీ

మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి (MA&UD) శాఖ జారీ చేసిన జీవో ఎంఎస్ నెం.92 ప్రకారం, గతంలో ప్రతి మూడేళ్లకు ఒకసారి ఉండే 33.33 శాతం అద్దె పెంపు ఉండేది. కానీ ఇప్పుడు ఏటా 7 శాతం పెంపును ఈ కొత్త నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లోని వివాదాలు, బకాయిలు, పద్ధతులపై విస్తృతమైన సమీక్ష జరిపిన తర్వాత ఈ చర్య తీసుకున్నట్లు ప్రధాన కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ తెలిపారు.

గతంలోని విధానం వివాదాలకు దారితీసిందని, 18 మున్సిపాలిటీల పరిధిలోని 584 మంది లీజుదారులు కోర్టును ఆశ్రయించడంతో రూ.9.43 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని అధికారులు పేర్కొన్నారు. ఈ సవరించిన విధానం వ్యాపారులకు, ముఖ్యంగా చిన్న వ్యాపారాలకు అద్దె లభ్యతను, అందుబాటు ధరలను నిర్ధారించే లక్ష్యంతో ఉంది.

మున్సిపల్ కాంప్లెక్స్‌లలో ఖాళీల సమస్యను పరిష్కరించడానికి, ప్రభుత్వం అంతస్తుల వారీగా అద్దె హేతుబద్ధీకరణను కూడా ప్రవేశపెట్టింది. దీని ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్ అద్దె కంటే మొదటి అంతస్తు అద్దెను 20 శాతం తక్కువగా, పై అంతస్తుల అద్దెను 30 శాతం తక్కువగా నిర్ణయించింది.

కొత్త విధానంతో వ్యాపారులకు భారం లేకుండా ఉంటుంది. అద్దె చెల్లింపులు సక్రమంగా జరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. మున్సిపాలిటీలకు స్థిరమైన ఆదాయం వస్తుంది. ఖాళీగా ఉంటున్న పైఅంతస్తుల షాపులను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. పైకి వెళ్లే కొద్ది అద్దె తగ్గనుంది.

కొత్తగా లేదా మళ్లీ లీజుకు ఇస్తే అద్దె నిర్ణయం మూడు అంశాల ప్రాతిపదిక ఉంటుందని అధికారులు వెల్లడించారు. మార్కెట్‌ విలువలో 10 శాతం, పరిసర ప్రాంతాల్లో ఉన్న అద్దెను చూస్తారు, లేదా గత అద్దెపై 7 శాతం పెంపు ఉండనుంది. ఈ మూడు అంశాల్లో ఎక్కువగా ఉన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. లీజ్ రూల్స్ ప్రకారం.. మూడు సంవత్సరాల వరకు మున్సిపాలిటీలు, 3 నుంచి 25 ఏళ్ల లీజుకు ప్రభుత్వ అనుమతి ఉండాలి. ప్రస్తుతం ఉండే లీజ్ ఒప్పందాలు పూర్తి అయిన తర్వాతే.. లీజ్ నిబంధనలు అమల్లోకి వస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks