విజయవాడలో గాదె సాయికృష్ణ మరణం కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, కృష్ణలంక మాజీ సీఐ నాగరాజుకు కుడిభుజాలుగా వ్యవహరించిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. సీఐ అరెస్ట్ అయినప్పటి నుంచి పరారీలో ఉన్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని సూర్యారావుపేట ఏసీపీ కార్యాలయానికి వచ్చి స్వయంగా లొంగిపోయారు. సాయికృష్ణ మృతి వెనుక వీరు సీఐ నాగరాజుకు పూర్తిస్థాయిలో సహకరించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ధారించింది.

సిట్ విచారణలో లొంగిపోయిన ఈ ఇద్దరు పోలీసుల విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని అసాంఘిక కార్యకలాపాలకు వీరే సూత్రధారులని తేలింది. హెడ్ కానిస్టేబుల్ అశోక్ స్టేషన్ పరిధిలోని బార్లు, మద్యం దుకాణాలు, లాడ్జీలు.. ఇతర విషయాలను చూసుకునేవాడు. అంతేకాకుండా.. సివిల్ సెటిల్‌మెంట్లు చేస్తూ పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
హెడ్ కానిస్టేబుల్ నాని రౌడీషీటర్లు, పాత నేరస్థులతో ముఠాగా ఏర్పడి బెదిరింపులకు పాల్పడేవాడు. గతంలో పటమట స్టేషన్‌లో ఉన్నప్పుడు స్పా సెంటర్ల నిర్వాహకులను వేధించడంతో ఇతడిని వీఆర్‌కు పంపారని తెలుస్తోంది. గన్నవరంలో పనిచేసినప్పుడు ఓ మిస్సింగ్ కేసులో తానే ఎస్సైని అంటూ డబ్బులు వసూలు చేసి సస్పెండ్ కూడా అయ్యాడు.
పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్ల కౌన్సెలింగ్, నిందితుల విచారణ వంటి అధికారిక వ్యవహారాల్లో సురేష్ అనే ప్రైవేట్ వ్యక్తిని కూడా వీరు భాగస్వామిని చేసినట్లు సిట్ గుర్తించింది. గత నెల 29న సాయికృష్ణ బంధువులను బెదిరించేందుకు లేదా ప్రభావితం చేసేందుకు అశోక్, నాని, సురేష్ కలిసి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరానికి వెళ్లినట్లు ఆధారాలు లభించాయి.
ఇప్పటికే ప్రైవేట్ వ్యక్తి సురేష్‌ను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు, ఇప్పుడు లొంగిపోయిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఈ లొంగుబాటుతో సాయికృష్ణ మృతి వెనుక ఉన్న మరిన్ని అసలు నిజాలు, నగరంలో పోలీసుల అండతో సాగిన మరికొన్ని అక్రమ దందాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
{{/usCountry}}ఇప్పటికే ప్రైవేట్ వ్యక్తి సురేష్‌ను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు, ఇప్పుడు లొంగిపోయిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఈ లొంగుబాటుతో సాయికృష్ణ మృతి వెనుక ఉన్న మరిన్ని అసలు నిజాలు, నగరంలో పోలీసుల అండతో సాగిన మరికొన్ని అక్రమ దందాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
{{/usCountry}}