నన్ను వాట్సాప్ గ్రూప్‌ నుంచి తొలగించారు.. హర్ట్ అయ్యాను.. పోలీస్ స్టేషన్ వెళ్లిన మహిళ!

హైదరాబాద్‌లో ఓ మహిళ పోలీస్ స్టేషన్ వెళ్లింది. అయితే దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఎందుకంటే తనను వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారనే కారణంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించడం విశేషం.

Published on: Jun 28, 2026, 15:35:08 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

డిజిటల్ యుగంలో సోషల్ మీడియా గ్రూపుల వివాదాలు చివరకు పోలీస్ స్టేషన్ల వరకు వెళ్తున్నాయి. వాట్సాప్ గ్రూప్ నుండి బ్లాక్ చేసి, తొలగించారనే కారణంతో ఓ మహిళ తనకు మానసిక వేధింపులు జరిగాయంటూ స్థానిక పోలీసులను ఆశ్రయించిన వింత ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. తనను తిరిగి గ్రూపులో చేర్చుకునేలా చర్యలు తీసుకోవాలని సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారని పోలీస్ స్టేషన్ వెళ్లిన మహిళ
వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారని పోలీస్ స్టేషన్ వెళ్లిన మహిళ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇలా ఉంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎన్‌బీటీ నగర్ నివాసితులు స్థానిక బస్తీ సమస్యలు, కాలనీ విషయాలను పంచుకోవడానికి ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. ఈ గ్రూపులో స్థానిక సమస్యలు మినహా, ఎలాంటి రాజకీయ పరమైన అభిప్రాయాలు లేదా సందేశాలు పోస్ట్ చేయకూడదని గ్రూప్ అడ్మిన్ ముందే కచ్చితమైన నిబంధనలు పెట్టారు.

అయితే ఫిర్యాదు చేసిన మహిళ ఈ నిబంధనలను ఉల్లంఘించి, గ్రూపులో రాజకీయాలకు సంబంధించిన సందేశాలను నిరంతరం పోస్ట్ చేస్తూ వచ్చారు. దీనిపై గ్రూప్ సభ్యుల మధ్య వివాదం మొదలైంది. హెచ్చరించినా వినకపోవడంతో గ్రూప్ అడ్మిన్ ఆమెను వాట్సాప్ గ్రూప్ నుండి తొలగించారు(రిమూవ్ చేశారు).

గ్రూప్ నుండి తొలగించడాన్ని సదరు మహిళ అవమానంగా భావించింది. తన్ను మళ్లీ గ్రూపులో చేర్చుకోవాలని ఆమె అడ్మిన్‌ను కోరినప్పటికీ, అందుకు అడ్మిన్ నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ.. బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి, గ్రూప్ సభ్యులు తనను మానసికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది.

కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు గ్రూప్ అడ్మిన్‌ను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ గ్రూప్ అడ్మిన్ సదరు మహిళను గ్రూపులోకి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి చేర్చుకోబోమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకే తొలగించామని, ఈ విషయంలో తాము తదుపరి చర్యల కోసం చట్టపరమైన సలహా తీసుకుంటున్నట్లు అడ్మిన్ పోలీసులకు తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More