అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములపై కీలక అప్డేట్.. 60 రోజులు డెడ్‌లైన్
అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూముల మీద ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ భూములకు సంబంధించి ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారం కోసం కాలపరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములపై వచ్చే ఫ్రీహోల్డ్ దరఖాస్తుల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ భూములకు సంబంధించిన ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియను వేగవంతం చేస్తూ పరిపాలనాపరమైన స్పష్టమైన నిబంధనలతో కూడిన జీవో 659ను జారీ చేసింది. భూ యజమానులకు వేగంగా యాజమాన్య హక్కులు కల్పించడమే లక్ష్యంగా రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం ఈ ఉత్తర్వుల ద్వారా కచ్చితమైన కాలపరిమితులను నిర్దేశించింది.

సాధారణ ప్రజలు, రైతులు తమ భూముల ఫ్రీహోల్డ్ కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా రెవెన్యూ యంత్రాంగానికి గడువు విధించారు. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను తహసీల్దార్, ఆర్డీవో పరిధిలో గరిష్టంగా 60 రోజుల్లోగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉంటుంది. నిర్దిష్టమైన, క్లియరెన్స్ ఉన్న కొన్ని ప్రత్యేక కేటగిరీ దరఖాస్తులను కేవలం 30 రోజుల్లోనే క్లియర్ చేయాలని ఆదేశాలు వెళ్లాయి.
దరఖాస్తుల ఆలస్యానికి చెక్ పెట్టేందుకు సాంకేతిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. దరఖాస్తుదారుడు ఆన్‌లైన్ కేంద్రం లేదా మీ-సేవ ద్వారా అప్లై చేసిన మరుక్షణమే ఆ సమాచారం నేరుగా సంబంధిత తహసీల్దార్ లాగిన్‌కు చేరేలా సిస్టమ్‌ను అప్డేట్ చేశారు. ఫ్రీహోల్డ్ మంజూరైన తర్వాత ప్రత్యేకంగా ఫ్రీహోల్డ్ ప్రొసీడింగ్స్ కాపీని అధికారులకు సమర్పించాల్సిన అవసరం లేదు.
వెబ్‌ల్యాండ్ పోర్టల్‌లో ఫ్రీహోల్డ్ వివరాలు నమోదైన వెంటనే యజమానులు తమ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేరుగా పూర్తి చేసుకోవచ్చు. వెబ్‌ల్యాండ్‌లో నమోదైన డేటాను అధికారిక రికార్డుల్లో భద్రపరచాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
ఈ జీవో అమలుతో ఏళ్ల తరబడి భూ వివాదాల్లో చిక్కుకున్న రైతులు, భూ యజమానులకు ఊరట లభించనుంది. భూములపై పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు దక్కడమే కాకుండా, వాటిని అమ్ముకోవడం లేదా బ్యాంకు రుణాలు పొందడం సులభతరం కానుంది. ఎలాంటి చట్టపరమైన లేదా పరిపాలనాపరమైన చిక్కులు లేకుండా అధికారికంగా భూ లావాదేవీలు నిర్వహించుకోవచ్చని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 659 ద్వారా రెవెన్యూ సేవల వేగం పుంజుకోవడంతో పాటు లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


