సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే మూల మంత్రాలుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రతి వారమూ ప్రజల మధ్యలోనే ఉంటున్నానని వెల్లడించారు. రాష్ట్ర సచివాలయానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రజల జీవితాల్లో వెలుగు వచ్చేలా చేయటమే అసలైన సుపరిపాలన అని దానికి కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని అన్నారు.

కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం పండువారిపేటలో నిర్వహించిన మీ భూమి- మీహక్కు గ్రామసభలో సీఎం పాల్గొని సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ప్రతి నెలలోనూ వీలైనన్ని సార్లు ప్రజల మధ్యకు వచ్చి బాగోగులు తెలుసుకుంటున్నానని అన్నారు. ప్రతినెలా మొదటి తేదీనే పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందిస్తూ ప్రజల్ని కలుస్తూ వారి కష్ట సుఖాలను తెలుసుకుంటున్నానని అన్నారు. పీ4తో సామాజిక బాధ్యత కింద ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. అభివృద్ధి చేస్తేనే సంపద సృష్టికి ఆస్కారం ఉంటుందని జీవన ప్రమాణాలు పెంచి అంతా గౌరవంగా జీవించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
భూమికి భద్రత
ప్రతీ నెలా 9 తేదీనే మీ భూమి- మీ హక్కు కార్యక్రమానికి హాజరై రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. భూమిపై రైతులు, యజమానులకు హక్కులు కల్పించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత పాలకులు రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి వ్యవస్థను ధ్వంసం చేశారని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు తెచ్చి ప్రజల భూముల్ని కాజేసే ప్రయత్నం చేశారని ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసేశామని తెలిపారు. గత పాలకులు రీసర్వే పేరుతో అనేక ఘోరాలు, నేరాలు, పాపాలు చేశారని.. పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వ భూములపై కూడా తమ ఫోటోలు వేసుకున్నారని అన్నారు.
సర్వే రాళ్లపై బొమ్మలు వేసుకునే పిచ్చి ఏమిటో ఎవరికీ అర్థం కాలేదన్నారు చంద్రబాబు. ఇష్టం లేని వ్యక్తుల భూముల్ని, ఆస్తుల్ని 22ఏ జాబితాలో చేర్చి ఇబ్బందులు పెట్టారన్నారు. అందుకే పటిష్టంగా రీసర్వే ప్రక్రియను పూర్తి చేసి ఎక్కడా అవకతవకలు లేకుండా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఇస్తున్నామన్నారు. ఈ-కేవైసీ, క్యూఆర్ కోడ్ , బ్లాక్ చెయిన్ టెక్నాలజీ లాంటి భద్రతా ఫీచర్లను పెట్టి పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నామని అన్నారు.
రెవెన్యూ సంస్కరణలు
{{/usCountry}}సర్వే రాళ్లపై బొమ్మలు వేసుకునే పిచ్చి ఏమిటో ఎవరికీ అర్థం కాలేదన్నారు చంద్రబాబు. ఇష్టం లేని వ్యక్తుల భూముల్ని, ఆస్తుల్ని 22ఏ జాబితాలో చేర్చి ఇబ్బందులు పెట్టారన్నారు. అందుకే పటిష్టంగా రీసర్వే ప్రక్రియను పూర్తి చేసి ఎక్కడా అవకతవకలు లేకుండా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఇస్తున్నామన్నారు. ఈ-కేవైసీ, క్యూఆర్ కోడ్ , బ్లాక్ చెయిన్ టెక్నాలజీ లాంటి భద్రతా ఫీచర్లను పెట్టి పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నామని అన్నారు.
రెవెన్యూ సంస్కరణలు
{{/usCountry}}భూమికి భద్రత ఇవ్వటమే కూటమి ప్రభుత్వ అజెండా అని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ 8234 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి 36 లక్షల రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చినట్టు సీఎం వివరించారు. వచ్చే మార్చి నాటికి 8,582 గ్రామాల్లో 56 లక్షల పాస్ పుస్తకాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వచ్చే మార్చి నాటికి భూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆటో మ్యూటేషన్ సేవల్ని అందుబాటులోకి తెచ్చామని అన్నారు. వారసత్వ భూముల విభజనలో స్టాంప్ డ్యూటీని రూ.వెయ్యికే పరిమితం చేశామని అన్నారు. 1.25 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలిగిందన్నారు.
తప్పులు సరిచేసి 16 లక్షల ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించి సమస్యను పరిష్కరించామని చంద్రబాబు వివరించారు. శెట్టిపల్లి కంగుంది, వట్టి చెరుకూరు, ముదినేపల్లి లాంటి చోట్ల దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న 244 కీలక భూ సమస్యలకు విముక్తి కల్పించామని తెలిపారు. అమలాపురంలోని మాచవరం, ముమ్మిడివరం, రామచంద్రాపురంలో బ్రిటీష్ కాలంలో 1908 నుంచి 22 ఏ1 కింద భూములు నిషేధంలో ఉన్నాయని ఈ సమస్యను కూడా పరిష్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. 56.37 ఎకరాల భూమిని 1410 మందికి లబ్ది కలిగేలా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గొడ్డలి పార్టీ చేసిన తారుమారు చేసిన రికార్డుల్ని ప్రక్షాళన చేసి భూ సమస్యల్ని కొలిక్కి తెస్తున్నామని సీఎం వివరించారు.
సముద్రంలోకి వెయ్యి టీఎంసీలు
నీటి భద్రతకు, భూమి భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో తీవ్రమైన ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ గోదావరి నుంచి ఈ ఏడాది వెయ్యి టీఎంసీలకు పైగా నీరు సముద్రంలోకి వెళ్లిందన్నారు.ఆ నీటిని వినియోగించుకుంటే రాష్ట్రానికి ప్రయోజనం కలిగేదని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో డయాఫ్రామ్ వాల్ కొట్టుకు పోయిందని.. రాజకీయ కక్షతో కాంట్రాక్టర్ని మార్చటంతో ప్రాజెక్టు ఆలస్యమైందని స్పష్టం చేశారు. 2024లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన మద్దతు ఢిల్లీలోనూ సంజీవనిగా పనిచేసిందని రాష్ట్రానికి ఎక్కువ నిధులు తెచ్చుకోగలుగుతున్నట్టు వివరించారు.