LPG Gas Cylinder : ఆంధ్రప్రదేశ్‌లో ఓటీపీ లేకుండానే గ్యాస్ సిలిండర్ల డెలివరీ
LPG Gas Cylinder : అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఓటీపీ చెప్పకున్నా గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయాలని కేంద్రం తెలిపింది. మెుబైల్ నెట్‌వర్క్‌లు నిలిచిపోయే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది.
సాధారణంగా గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో వినియోగదారుడి నమోదిత మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఏజెంట్‌కు చెబితేనే సిలిండర్ అందజేస్తారు. అయితే అర్నబ్ తుపాను తీవ్రత కారణంగా ప్రభావిత జిల్లాల్లో మొబైల్ నెట్‌వర్క్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. దీనితో వినియోగదారులకు ఓటీపీలు అందక, డెలివరీ ప్రక్రియ స్తంభించి వంటగ్యాస్ అందుబాటులో లేక బాధితులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది.

ఈ విషయాన్ని తక్షణమే గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా స్పందించింది. కేంద్ర చమురు మంత్రిత్వ శాఖతో పాటు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం సంస్థల ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపింది. ప్రజల అత్యవసర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఓటీపీ నిబంధనను పక్కనబెట్టి నేరుగా డెలివరీ ఇచ్చేలా వెసులుబాటు కల్పించాలని కోరింది. ఏపీ ప్రభుత్వ అభ్యర్థనపై కేంద్రం సానుకూలంగా స్పందించి తక్షణ ఆదేశాలు ఇచ్చింది.
కేంద్రం ఇచ్చిన తాత్కాలిక మినహాయింపుతో రాష్ట్రంలోని 13 తుపాను ప్రభావిత జిల్లాల ప్రజలకు పెద్ద ఎత్తున ఉపశమనం లభించనుంది. ముఖ్యంగా తీవ్ర నష్టం వాటిల్లిన.. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా సహా పరిసర ప్రాంతాల్లో డెలివరీ ఏజెంట్లు నేరుగా బాధితుల ఇళ్లకు వెళ్లి ఓటీపీతో సంబంధం లేకుండా సిలిండర్లను అందజేయనున్నారు.
అత్యవసర వేళల్లో ప్రతి ఇంటీకీ వంటగ్యాస్ అందుబాటులో ఉండేలా పక్కా ప్రణాళికతో వ్యవహరించాలని చమురు మార్కెటింగ్ కంపెనీలు, స్థానిక గ్యాస్ ఏజెన్సీలను కేంద్రం ఆదేశించింది. ప్రభావిత ప్రాంతాల్లోని ఏజెన్సీల వద్ద సరిపడా స్టాక్ అందుబాటులో ఉంచాలని తెలిపింది. నెట్‌వర్క్ సమస్యలను సాకుగా చూపకుండా డెలివరీ ఏజెంట్లను క్షేత్రస్థాయికి పంపి పంపిణీ వేగవంతం చేయాలని పేర్కొంది. గ్యాస్ అక్రమ రవాణా లేదా కృత్రిమ కొరత సృష్టించకుండా జిల్లా యంత్రాంగం, చమురు సంస్థల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేసింది.
ఒకవైపు తుపాను ధాటికి విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిని కష్టాల్లో ఉన్న బాధితులకు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వంటగ్యాస్ కష్టాల నుంచి ఊరటనిచ్చింది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ, మొబైల్ నెట్‌వర్క్ టవర్ల పునర్నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. నెట్‌వర్క్ పూర్తిగా కోలుకునే వరకు ఈ ఓటీపీ రహిత గ్యాస్ పంపిణీ విధానం అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


