అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇటీవల హత్యాచారం కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏడేళ్ల బాలిక ఈ ఘటనలో దారుణంగా చనిపోయింది. ఈ కేసులో నిందితుడు కులవర్ధన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తుండగా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చివరిచూపునకు అతడి తల్లి, బంధువు ఎవరూ రాలేదు. చూసేందుకు నిరాకరించరు. అంతేకాదు.. కులవర్ధన్ డెడ్‌బాడీని తీసుకెళ్లమని చెప్పారు.

దీంతో మున్సిపల్ సిబ్బంది కులవర్ధన్ మృతదేహాన్ని చెత్త తరలించే ఆటోలో తీసుకెళ్లారు. వారే అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఏం జరిగింది?
మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లె ప్రాంతంలో పవర్‌లూమ్ రంగంలో పనిచేస్తున్న కులవర్ధన్ సోమవారం రాత్రి మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు. మదనపల్లె పట్టణంలో బాధితురాలు రెండో తరగతి చదువుతోంది. సోమవారం సాయంత్రం ఆడుకుంటూ అదృశ్యమైంది. తల్లిదండ్రులు, బంధువులు ఎంత వెతికినా దొరకలేదు. దీంతో ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
కుటుంబీకులు అనుమానంతో బాలిక ఇంటికి సమీపంలోనే ఉండే కులవర్ధన్ అనే వ్యక్తిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కులవర్ధన్ ఇంటికి చేరుకున్నారు. లోపల తలుపులు వేసుకుని కులవర్ధన్ ఎంతకీ తీయకపోవడంతో పోలీసులు గడియ పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ ఓ డ్రమ్ములో బాలిక మృత దేహం కనిపించింది. పోలీసులు అతడి ఇంట్లో గాలించగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కులవర్ధన్‌ను చంపేందుకు స్థానికులు చూశారని, అతడిని అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్పారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు బాలికపై లైంగిక దాడి చేసి, బాలికను హత్య చేశాడు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించి, మదనపల్లె, చుట్టుపక్కల 200 మందికి పైగా పోలీసులను బందోబస్తులో భాగంగా మోహరించారు. నిందితులను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ, స్థానికులు, విద్యార్థులు, మహిళలు, నిరసనలు చేపట్టారు.
{{/usCountry}}పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు బాలికపై లైంగిక దాడి చేసి, బాలికను హత్య చేశాడు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించి, మదనపల్లె, చుట్టుపక్కల 200 మందికి పైగా పోలీసులను బందోబస్తులో భాగంగా మోహరించారు. నిందితులను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ, స్థానికులు, విద్యార్థులు, మహిళలు, నిరసనలు చేపట్టారు.
{{/usCountry}}బాధితురాలి తల్లిదండ్రులు కూడా మంగళవారం (ఫిబ్రవరి 17, 2026) సాయంత్రం వరకు తమ కుమార్తె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులకు అప్పగించడానికి ఇష్టపడలేదు. అర్ధరాత్రి దగ్గరలో డీఐజీ (కర్నూలు) కోయ ప్రవీణ్ బాలిక పోస్ట్‌మార్టం నివేదికను ధృవీకరించారు. ఇది లైంగిక దాడి, హత్య అని ప్రకటించారు. డీఐజీ ప్రకటన తర్వాత ఎనిమిది గంటల తర్వాత.. కులవర్ధన్ మృతదేహం మదనపల్లె శివార్లలో దొరికింది. కులవర్ధన్‌ను రక్షక వాహనంలో తీసుకెళ్తుండగా పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడని ఎస్పీ ధీరజ్ తెలిపారు. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. కులవర్ధన్ మృతితో మదనపల్లెవాసులు సంబరాలు చేసుకున్నారు. తాజాగా అతడి అంత్యక్రియలు కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు.