Sign in

పోలీస్ వాహనం నుండి దూకేసిన కులవర్ధన్.. మదనపల్లె నిందితుడి మృతిపై క్లారిటీ ఇచ్చిన ఎస్పీ!

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన నిందితుడు చెరువులో శవంగా కనిపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎస్పీ ధీరజ్ మాట్లాడారు.

Published on: Feb 18, 2026, 14:31:58 IST
By , Madanapalle
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు బుధవారం ఉదయం అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం ముదివేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కనసానివారిపల్లె గ్రామంలోని చెరువులో శవమై కనిపించాడు. మంగళవారం (ఫిబ్రవరి 17, 2026) ఉదయం నేరం వెలుగులోకి వచ్చింది.

మదనపల్లె ఘటన
మదనపల్లె ఘటన

అయితే నిందితుడు కలవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్పీ ధీరజ్ ప్రకటించారు. నిందితుడిని మంగళవారం తీసుకెళ్తుండగా.. పోలీసుల నుంచి తప్పించుకున్నట్టుగా వెల్లడించారు. 'కులవర్ధన్‌ను రక్షక్ వాహనంలో తీసుకెళ్తుండగా మా నుంచి తప్పించుకుని పారిపోయాడు. మూడు బృందాలతో గాలింపు చేపట్టాం. పొద్దున శవంగా తేలాడు. ఈ ఇష్యూను రాజకీయం చేసిన వారిపై కేసులు పెట్టాం.. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. దీనిపై వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాం.' అని ఎస్పీ ధీరజ్ తెలిపారు.

ఏం జరిగింది అంటే?

మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లె ప్రాంతంలో పవర్‌లూమ్ రంగంలో పనిచేస్తున్న కులవర్ధన్ సోమవారం రాత్రి మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు. మదనపల్లె పట్టణంలో బాధితురాలు రెండో తరగతి చదువుతోంది. సోమవారం సాయంత్రం ఆడుకుంటూ అదృశ్యమైంది. తల్లిదండ్రులు, బంధువులు ఎంత వెతికినా దొరకలేదు. దీంతో ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

కుటుంబీకులు అనుమానంతో బాలిక ఇంటికి సమీపంలోనే ఉండే కులవర్ధన్‌ అనే వ్యక్తిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కులవర్ధన్‌ ఇంటికి చేరుకున్నారు. లోపల తలుపులు వేసుకుని కులవర్ధన్‌ ఎంతకీ తీయకపోవడంతో పోలీసులు గడియ పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ ఓ డ్రమ్ములో బాలిక మృత దేహం కనిపించింది. పోలీసులు అతడి ఇంట్లో గాలించగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కులవర్ధన్‌ను చంపేందుకు స్థానికులు చూశారని, అతడిని అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు బాలికపై లైంగిక దాడి చేసి, బాలికను హత్య చేశాడు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించి, మదనపల్లె, చుట్టుపక్కల 200 మందికి పైగా పోలీసులను బందోబస్తులో భాగంగా మోహరించారు. నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ, స్థానికులు, విద్యార్థులు, మహిళలు, నిరసనలు చేపట్టారు.

బాధితురాలి తల్లిదండ్రులు కూడా మంగళవారం (ఫిబ్రవరి 17, 2026) సాయంత్రం వరకు తమ కుమార్తె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులకు అప్పగించడానికి ఇష్టపడలేదు. అర్ధరాత్రి దగ్గరలో డీఐజీ (కర్నూలు) కోయ ప్రవీణ్ బాలిక పోస్ట్‌మార్టం నివేదికను ధృవీకరించారు. 'ఇది లైంగిక దాడి, హత్య అని ప్రకటించారు. డీఐజీ ప్రకటన తర్వాత ఎనిమిది గంటల తర్వాత.. కులవర్ధన్ మృతదేహం మదనపల్లె శివార్లలో దొరికింది. కులవర్ధన్‌ను రక్షక వాహనంలో తీసుకెళ్తుండగా పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడని ఎస్పీ ధీరజ్ తెలిపారు. ఉదయం శవంగా తేలాడని వెల్లడించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More