పల్నాడు జిల్లా అధికారులు కోటప్పకొండ ఆలయంలో జరగబోయే మహా శివరాత్రి వేడుకల కోసం భక్తులు సౌకర్యార్థం విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. హెలికాప్టర్ రైడ్‌లు, వీక్షణ కేంద్రాలు, బోటింగ్ సౌకర్యాలు, ఇతర సౌకర్యాలతో భక్తులను స్వాగతించడానికి సిద్ధమయ్యారు అధికారులు.

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కోటప్పకొండ ఉత్సవాల నిర్వహణకు రూ.30 లక్షలు మంజూరు చేసినట్లు ప్రకటించారు. ఉత్సవాల సమయంలో త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించే ప్రతి భక్తుడికి ప్రసాదంగా ఒక లడ్డూను ఉచితంగా అందిస్తామని చెప్పారు. గత సంవత్సరాల అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుని దర్శన ఏర్పాట్లను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం వీఐపీ పాస్‌లకు బదులుగా వీఐపీ టిక్కెట్లను జారీ చేయాలని నిర్ణయించింది.
మహా శివరాత్రి సన్నాహకాలపై మూడో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి. ఆంజనేయులు, ఎమ్మెల్యేలు చదలవాడ అరవింద్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, జూలకంటి బ్రహ్మానంద రెడ్డి హాజరయ్యారు. వీఐపీ దర్శనం టిక్కెట్లు ఫిబ్రవరి 10 నుండి 14 వరకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని, వీఐపీలకు కేటాయించిన సమయ స్లాట్‌లలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని మంత్రి చెప్పారు. క్యూ లైన్లలో ఎక్కువసేపు వేచి ఉండకుండా వేగంగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ నెల 10 వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో వీఐపీ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రతి రోజు 1500 టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఇచ్చిన టైం స్లాట్‌లో మాత్రమే దర్శనం చేసుకునేలా చూస్తారు.
విద్యుత్ అంతరాయాలు తలెత్తకుండా చూడాలని, లిఫ్ట్, విద్యుత్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం 550 బస్సులను నడిపిస్తే.. ఈ సంవత్సరం 618 బస్సులను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. వీటిలో 95 బస్సులు ప్రత్యేకంగా భక్తులను కొండ కిందికి చేరవేయడానికి కేటాయించారు. రాత్రిపూట కొండపై బస చేసే యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు ఊరేగింపుల సమయంలో మెరుగైన విద్యుత్ దీపాల ఏర్పాటు కూడా చేశారు.
క్యూలైన్లలో భక్తులు ఎక్కువగా వెయిట్ చేయకుండా త్వరగా దైవ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినానికి కోటప్పకొండకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఆలయ పరిసరాలు, కొండ మార్గాలు, క్యూ లైన్ల ప్రాంతాల్లో పారిశుధ్య పనులు నిరంతరంగా చేపట్టనున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, అంబులెన్స్‌లు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూస్తున్నారు.
{{/usCountry}}క్యూలైన్లలో భక్తులు ఎక్కువగా వెయిట్ చేయకుండా త్వరగా దైవ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినానికి కోటప్పకొండకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఆలయ పరిసరాలు, కొండ మార్గాలు, క్యూ లైన్ల ప్రాంతాల్లో పారిశుధ్య పనులు నిరంతరంగా చేపట్టనున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, అంబులెన్స్‌లు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూస్తున్నారు.
{{/usCountry}}