మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటు పరిహారాలు తెలుసుకోండి!
మహాశివరాత్రి (Maha shivaratri 2026) నాడు శివుడు, పార్వతి ఒకటైన సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడం, కొన్ని పరిహారాలను పాటించడం వంటివి చేస్తూ ఉంటాము. పైగా శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రాలను ఆ రోజు సమర్పిస్తాము. మహాశివరాత్రి నాడు సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం 12 గంటలకు పైగా ఉంటుంది.
ప్రతి ఏటా మాఘ మాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రిని జరుపుకుంటాము. శివుడికి, పార్వతీదేవికి శివరాత్రి అంకితం చేయబడింది. ఆ రోజు వారిద్దరూ ఒకటయ్యారని చెబుతారు. మహాశివరాత్రి (Maha shivaratri 2026) నాడు శివుడు, పార్వతి ఒకటైన సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడం, కొన్ని పరిహారాలను పాటించడం వంటివి చేస్తూ ఉంటాము. పైగా శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రాలను ఆ రోజు సమర్పిస్తాము.

మహాశివరాత్రి 2026 తేదీ, సమయం:
ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 15, 2026న వచ్చింది. ఆ రోజు కొన్ని ప్రత్యేకమైన యోగాలు కూడా ఏర్పడటం విశేషం. శివరాత్రి నాడు శివ, పార్వతులను ఆరాధించడం వలన అదృష్టం కలగడంతో పాటు సంతోషం, వివాహ జీవితంలో ఆనందం ఉంటుంది. అలాగే జీవితంలో పురోగతిని చూస్తారు. వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది. శివరాత్రి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేస్తే కూడా శివుని ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది.
మహాశివరాత్రి 2026 నాడు ఈ ప్రత్యేక పరిహారాలను పాటించండి:
శివరాత్రి నాడు శివుడికి ఎంతో ఇష్టమైన ఉమ్మెత్త పువ్వులను సమర్పించండి. దీంతో వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు.శివరాత్రి నాడు శివుని ఆలయానికి వెళ్లి శివలింగానికి పూలను సమర్పించి, అరగంట పాటు ఆలయంలో కూర్చుని “శ్రీ శివాయ నమస్తుభ్యం” అనే మంత్రాన్ని జపించండి.
లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే, శివుడు ముందు ఉమ్మెత్త పువ్వును పెట్టి, ఆ పువ్వును తీసుకుని ఎర్రటి వస్త్రంలో చుట్టి ఇంట్లో డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టండి. దీంతో శివుని అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారంలో కూడా లాభాలు వస్తాయి. ఈ పరిహారాన్ని ఉదయం పాటించండి.
మహాశివరాత్రి నాడు సర్వార్థ సిద్ధి యోగం:
సర్వార్థ సిద్ధి యోగం: ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7:48 వరకు
నిషిత కాలం: రాత్రి 11:52 నుంచి 12:42 వరకు
మహాశివరాత్రి నాడు సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడబోతోంది. ఈ శక్తివంతమైన యోగం 12 గంటలకు పైగా ఉంటుంది. సర్వార్థ సిద్ధి యోగం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7:48 వరకు ఉంటుంది. ఈ సమయంలో శివుడుని ఆరాధించడం మంచిది. అలాగే శివునికి అభిషేకం కూడా చేయవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


