ఈ ఐదు రాశుల వారు లక్ష్మీదేవి అనుగ్రహంతో వ్యాపారంలో దూసుకెళ్ళిపోతారు, తిరుగే ఉండదు!
చాలా మంది ఈ మధ్యకాలంలో సొంత వ్యాపారాలను పెడుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు వ్యాపారంలో విజయాలను అందుకుంటారు. ఏ పని ప్రారంభించినా కూడా ఈ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. నాయకత్వ లక్షణాలు కూడా వీరిలో ఎక్కువగా ఉంటాయి. తక్కువ కాలంలోనే వ్యాపారంలో సక్సెస్‌ను అందుకుంటారు.
రాశుల ఆధారంగా ఎన్నో విషయాలను చెప్పడానికి వీలవుతుంది. రాశుల ఆధారంగా భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చు. అలాగే ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయో కూడా రాశుల ఆధారంగా చెప్పొచ్చు. ఈ రాశుల వారు లక్ష్మీదేవి ఆశీస్సులు కలిగి ఉంటారు. వ్యాపారంలో బాగా రాణిస్తారు. చాలా మంది ఈ మధ్యకాలంలో సొంత వ్యాపారాలను పెడుతున్నారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు వ్యాపారంలో విజయాలను అందుకుంటారు. కష్టానికి తగ్గ ఫలితాలను చూస్తారు. ఏ పని ప్రారంభించినా కూడా ఈ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. నాయకత్వ లక్షణాలు కూడా వీరిలో ఎక్కువగా ఉంటాయి. తక్కువ కాలంలోనే వ్యాపారంలో సక్సెస్‌ను అందుకుంటారు. కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.
ఈ రాశుల వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.. వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు
1.వృషభ రాశి
వృషభ రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు వ్యాపారంలో బాగా రాణిస్తారు. పైగా వీరికి ఓపిక, ధైర్యం కూడా ఎక్కువ. ఈ రాశి వారు కష్ట పరిస్థితులను కూడా సులభంగా ఎదుర్కొంటారు. వీరి ఆలోచనలు కూడా భిన్నంగా ఉంటాయి. దీంతో అన్నిట్లో బాగా రాణిస్తారు.
2.సింహ రాశి
సింహ రాశి వారు వ్యాపారంలో బాగా రాణిస్తారు. అన్ని రంగాల్లో కూడా అద్భుతమైన విజయాలను అందుకుంటారు. అందరికంటే ముందుంటారు. తక్కువ కాలంలోనే వ్యాపారంలో సక్సెస్‌ను అందుకుంటారు. కష్టపడి పని చేస్తారు. కొత్త అవకాశాలు కూడా వీరిని వెతుక్కుంటూ వస్తాయి.
3.తులా రాశి
తులా రాశి వారు ఎక్కువగా కష్టపడతారు. క్రమశిక్షణతో ఉంటారు. లక్ష్యాలను సాధించడానికి మంచి ప్రణాళిక వేసుకుంటారు. తక్కువ కాలంలోనే వ్యాపారంలో బాగా రాణిస్తారు. మొత్తం మీద అనుకున్న వాటిలో సక్సెస్ అవుతారు.
4.కన్యా రాశి
కన్యా రాశి వారు అందరికంటే భిన్నంగా ఉంటారు. వారు చేసే పనులు కూడా క్రమబద్ధంగా, ప్రణాళికతో చేస్తారు. పైగా ఎలాంటి కష్ట పరిస్థితులు వచ్చినా కుంగిపోరు. ధైర్యంగా ముందుకు వెళ్తారు. వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు.
5.మకర రాశి
శని అనుగ్రహంతో మకర రాశి వారు ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. కష్టాన్ని నమ్ముకుంటారు. ఏదైనా పనిని మొదలుపెడితే పూర్తయ్యేదాకా దానిని వదిలిపెట్టరు. కష్ట పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయరు. ఎప్పుడూ కూడా మానసిక స్థితి బలంగా ఉంటుంది. కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది. వ్యాపారంలో సక్సెస్‌ను అందుకుంటారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


