శుక్రవారం నాడు ఈ ఐదు వస్తువులను గుమ్మం దగ్గర పెడితే దరిద్రం తొలగిపోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది!
చాలా మంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి శుక్రవారం కొన్ని పద్ధతులను పాటిస్తూ ఉంటారు. హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతి రోజుకీ కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. శుక్రవారం ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది, ఎందుకంటే ఈ రోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. శుక్రవారం నాడు కొన్ని పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
శుక్రవారంనాడు కొన్ని పాటించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. చాలా మంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి శుక్రవారం కొన్ని పద్ధతులను పాటిస్తూ ఉంటారు. హిందూ సంప్రదాయాల ప్రకారం చూసినట్లయితే ప్రతి రోజుకీ కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అన్ని వారాల్లో శుక్రవారం ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది, ఎందుకంటే ఈ రోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. శుక్రవారం నాడు కొన్ని పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

శుక్రవారం నాడు వీటిని దానం చేస్తే చాలా మంచిది.. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది
శుక్రవారం నాడు తీపి పదార్థాలను దానం చేయడం మంచిది. లక్ష్మీదేవితో పాటుగా శుక్ర గ్రహానికి కూడా ఈ శుక్రవారం ఎంతో ప్రత్యేకం. అలాగే తెల్లటి రంగులో ఉండే ఆహార పదార్థాలను దానం చేయడం వలన గ్రహదోషాలు తొలగిపోతాయి. పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఎక్కువ అవుతుంది.
లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి కూడా వీలవుతుంది. శుక్రవారం నాడు సంపద పెరగాలంటే పంచదార, ఉప్పు, పెరుగు వంటి వాటిని దానం చేస్తే మంచిది. దీంతో సంపద పెరుగుతుంది, కుటుంబంలో శ్రేయస్సు పెరుగుతుంది. దోషాలన్నీ తొలగిపోతాయి. ఆనందంగా ఉండొచ్చు.
శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శ్రీ యంత్రాన్ని ఆవుపాలతో కడిగి, ఆ తర్వాత యంత్రాన్ని డబ్బు ఉంచే చోట పెట్టాలి. ఇలా చేస్తే సానుకూల శక్తి పెరుగుతుంది, కుటుంబంలో శ్రేయస్సు ఉంటుంది.
దరిద్రం తొలగిపోవాలంటే శుక్రవారం నాడు గుమ్మం దగ్గర వీటిని పెట్టడం మంచిది
మామిడి తోరణం:
శుక్రవారం నాడు దరిద్రం తొలగిపోయి, ప్రతికూల శక్తి నుంచి బయట పడడానికి మామిడి ఆకులతో తోరణాన్ని కట్టండి. దీంతో ఇంటికి శుభశకునాలు ప్రవేశిస్తాయి. సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది.
ఉప్పు పాత్ర:
శుక్రవారం నాడు ఉప్పుతో నిండిన ఒక చిన్న పాత్రను గుమ్మం దగ్గర పెట్టండి. దీంతో దృష్టిదోషం, చెడు శక్తులు తొలగిపోతాయి. ఆనందంగా ఉండొచ్చు.
పసుపు నీరు, కర్పూరం:
గుమ్మం లోపల ఒక రాగి చెంబులో నీళ్లు పోసి, అందులో పసుపు, కర్పూరం, నాణెం వేయాలి. ఇలా చేయడం వలన ఐశ్వర్యం పెరుగుతుంది. ఆనందంగా ఉండొచ్చు. ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది.
రావి ఆకుల తోరణం:
శుక్రవారం నాడు మామిడి ఆకుల తోరణం లాగే రావి ఆకులతో తోరణాన్ని కట్టినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి. దీనిని శుభ సూచకంగా భావిస్తారు.
మిరపకాయలు, నిమ్మకాయలు:
మిరపకాయలను శుక్రవారం నాడు గుమ్మం దగ్గర కట్టడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి. ఆనందంగా ఉండొచ్చు.
కుంకుమతో స్వస్తిక్:
శుక్రవారం నాడు కుంకుమతో స్వస్తిక్ గుర్తును గుమ్మం పై వేయండి. దీంతో ఐశ్వర్యం కలిగి ఆనందంగా ఉండొచ్చు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


