Friday Puja: శుక్రవారం నాడు ఏ దేవుడిని పూజిస్తే మంచిది? శుక్ర గ్రహ స్థానం బలపడాలంటే ఏం చేస్తే మంచిదో తెలుసుకోండి!

Friday Puja: శుక్రవారం లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుకు లోటు ఉండదు. అలాగే శుక్రవారం నాడు శుక్రుడిని కూడా ఆరాధించాలి. శుక్రవారం నాడు లక్ష్మీ దేవిని పూజించి ఉపవాసం ఉంటే ఆనందం కలుగుతుందని భక్తుల నమ్మకం.

Published on: Dec 12, 2025 8:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Friday Puja: ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. సోమవారం శివుణ్ని ఆరాధిస్తాం. మంగళవారం నాడు హనుమంతుడిని ఆరాధిస్తాం. ఇలా ప్రతి రోజూ కూడా ఏదో ఒక దైవాన్ని పూజిస్తూ ఉంటాం. వారంలో ప్రతి రోజూ కూడా ఏదో ఒక దేవత ఆరాధనకు అంకితం చేయబడింది. ప్రతిరోజూ దైవ నామస్మరణలో ఉంటే అనేక రకాల లాభాలను పొందవచ్చు. కోరిన కోరికలు కూడా తీరిపోతాయి. అలాగే వారంలో ఉన్న ప్రతి రోజుకి కూడా ఏదో ఒక గ్రహానికి అంకితం చేయబడింది. శుక్రవారం నాడు ఎవరిని ఆరాధిస్తే విశేష ఫలితాలు పొందవచ్చు? శుక్రవారం నాడు దోషాలు తొలగిపోవడానికి ఏం చేయాలి? వంటి విషయాలను తెలుసుకుందాం.

Friday Puja: శుక్రవారం నాడు ఏ దేవుడిని పూజిస్తే మంచిది? (pinterest)
Friday Puja: శుక్రవారం నాడు ఏ దేవుడిని పూజిస్తే మంచిది? (pinterest)

శుక్రవారం నాడు ఏ దేవుడిని పూజించాలి?

శుక్రవారం లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుకు లోటు ఉండదు. ఆనందంగా ఉండొచ్చు. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే శుక్రవారం నాడు శుక్రుడిని కూడా ఆరాధించాలి. శుక్రవారం నాడు లక్ష్మీ దేవిని పూజించి ఉపవాసం ఉంటే ఆనందం కలుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుందని చెబుతారు. ఇక శుక్రవారం ఏం చేయాలి? శుక్ర గ్రహానికి సంబంధించి ఎలాంటి విషయాలను పాటించాలో కూడా ఇప్పుడే తెలుసుకుందాం.

శుక్ర గ్రహానికి అంకితం చేయబడిన శుక్రవారం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు ప్రేమ, ఆనందం, డబ్బు, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. జాతకంలో శుక్రుడు స్థానం బలంగా ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఆనందంగా, విలాసవంతమైన జీవితాన్ని గడపచ్చు. అదే శుక్రుడు బలహీనంగా ఉంటే సమస్యలు వస్తాయి. శుక్రుడి స్థానం బలహీనంగా ఉన్నట్లయితే ఉపవాసం ఉంటే మంచిది. శుక్రవారం నాడు ఉపవాసం ఉండే వారు తెల్లని దుస్తులు ధరించాలి. అలాగే తెల్లని పూలతో పూజ చేయాలి. బియ్యం, చక్కెర, తెల్లటి ఆహార పదార్థాలను దానం చేస్తే మంచిది. వరుసగా 21 లేదా 31 శుక్రవారాలు ఇలా ఉపవాసం చేయడం వలన జాతకంలో శుక్రుడి స్థానం బలపడుతుంది.

సంతోషి మాత పూజ

సంతోషి మాతను గణేశుడి కుమార్తెగా చెబుతారు. ఆమెను సంతృప్తి, సరళతకు దేవత అని అంటారు. ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిది. 16 శుక్రవారాలు సంతోషి మాతకు ఉపవాసం ఉండి సంతోషిమాతను ఆరాధించడం ఉత్తమం. అమ్మవారికి బెల్లం, శనగల్ని నైవేద్యంగా సమర్పించాలి.

మహిమగల వైభవలక్ష్మి వ్రతం

శుక్రవారం నాడు ఎంతో విశిష్టమైన వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే సంపద, ఆనందం, అదృష్టం కలుగుతాయి. వివాహిత స్త్రీలు ఉపవాసం ఉంటారు. 11 లేదా 21 శుక్రవారాలు ఇలా ఆచరిస్తారు.

వైభవలక్ష్మి వ్రత కథను చదువుకోవాలి. చివరగా ఏడు గృహిణీ స్త్రీలు లేదా బాలికలను పిలిచి పాయసాన్ని ప్రసాదంగా ఇస్తారు. వైభవలక్ష్మి వ్రత కథ పుస్తకాన్ని బహుమతిగా ఇస్తారు.