ఇంటి సింహద్వారానికి ఈ ఒక్క మూట కడితే అదృష్టం, ఐశ్వర్యం కలుగుతాయి!
కొంతమంది ఏ సమస్య రాకుండా ఉండడానికి వాస్తు నియమాలను పాటిస్తే, కొంత మంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని రకరకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు. చాలా మంది ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు అడుగుపెట్టకూడదని, నరదృష్టి వంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి సింహద్వారానికి రకరకాల వాటిని కడుతూ ఉంటారు.
ప్రతి ఒక్కరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం ఇంట్లో రకరకాల పద్ధతులను పాటిస్తూ ఉంటారు. కొంతమంది ఏ సమస్య రాకుండా ఉండడానికి వాస్తు నియమాలను పాటిస్తే, కొంత మంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని రకరకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు.

చాలా మంది ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు అడుగుపెట్టకూడదని, నరదృష్టి వంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి సింహద్వారానికి రకరకాల వాటిని కడుతూ ఉంటారు. సింహద్వారానికి ఈ మూట కట్టి ఉంచినట్లయితే వాస్తు దోషాలు తొలగిపోతాయి. అఖండ ధన లాభం కూడా కలుగుతుంది. మరి మీరు కూడా దీనిని అనుసరించాలనుకుంటున్నారా? అయితే ఏం చేయాలో ఇప్పుడే చూద్దాం.
వాస్తు శాస్త్రం
వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో వాస్తుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కనుక ఇంటి నిర్మాణ విషయంలో కచ్చితంగా వాస్తుని పాటిస్తూ ఉంటారు. వాస్తు యంత్రాలను చాలా మంది ఇంటికి కడుతూ ఉంటారు. అలా చేయడం వలన జీవితంలో అభివృద్ధి ఉంటుంది, ఆరోగ్యంగా ఉండొచ్చు, అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి.
ఇంటి సింహద్వారానికి ఈ వస్తువులను కడితే అదృష్టం, ఐశ్వర్యం కలుగుతాయి
మీ ఇంటి సింహద్వారం తూర్పు వైపు ఉన్నట్లయితే చాలా మంచి జరుగుతుంది. ముఖద్వారం పడమర లేదా ఉత్తరం వైపు ఉండొచ్చు. దక్షిణ ముఖంగా సింహద్వారం ఉంటే మాత్రం సమస్యలు వస్తాయి. ఆ ఇంట్లో ఉన్న వారికి కలిసి రాదు. కుటుంబంలో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి దక్షిణం వైపు ఇంటిని నిర్మించడం మంచిది కాదు. ఇల్లు దక్షిణం వైపు ఉన్నా మీకు బాగా కలిసి రావాలంటే గుమ్మానికి వీటిని వేలాడదీయడం మంచిది. అలా చేయడం వలన మంచి రోజులు మొదలవుతాయి.
మూట కట్టే విధానం
మంగళవారం లేదా శనివారం నాడు సాయంత్రం, ఇంటి యజమాని స్నానం చేసిన తర్వాత నల్లటి వస్త్రాన్ని తీసుకుని అందులో కొద్దిగా ఆవాలు, పెసలు, బియ్యం, రాళ్ల ఉప్పు, 11 రూపాయి కాసులు, ఎర్రటి పువ్వులను వేసి మూట కట్టి, ఆ మూటను ఇంటి ముఖద్వారానికి కట్టాలి. ఇలా ఆచరించడం వలన లక్ష్మీకటాక్షం కలుగుతుంది. చెడు శక్తులన్నీ తొలగిపోతాయి. ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరికీ మంచి రోజులు మొదలవుతాయి.
గుమ్మడికాయని కట్టండి
ఇంటికి ఒక గుమ్మడికాయని కట్టండి. ముఖద్వారానికి గుమ్మడికాయని కట్టినట్లయితే శుభఫలితాలు ఎదురవుతాయి. సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ధన ధాన్యాలతో ఇల్లంతా నిండి ఉంటుంది. గుమ్మడికాయను కట్టే ముందు దానిని శుభ్రంగా కడిగి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత గుమ్మానికి కట్టాలి. ఇంటికి కట్టిన గుమ్మడికాయకు హారతి ఇవ్వాలి, సాంబ్రాణితో పొగ వేయాలి. ఇలా చేయడం వలన కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుంది.
కలబంద మట్ట, నిమ్మకాయలు, స్వస్తిక్
- కలబంద మట్టను కూడా గుమ్మానికి వేలాడదీస్తే మంచి ఫలితం ఉంటుంది.
- నిమ్మకాయలను ఇంటి గుమ్మానికి కడితే భవిష్యత్తులో ఆపదలు రావు. దేవతలు ఇంటిని రక్షిస్తారు.
- ఇంటి ముందు ప్రతిరోజూ స్వస్తిక్ గుర్తు ఉండేటట్లు చూసుకోండి. అలా ఉన్నట్లయితే అదృష్టం కలిసి వస్తుంది.
జిల్లేడు వేర్లు
అప్పులతో బాధపడుతున్నట్లయితే జిల్లేడు మొక్క వేరును తెచ్చి నల్ల దారానికి కట్టి ఇంటి గుమ్మానికి కట్టండి. ఇలా చేయడం వలన నరదృష్టి, ఏడుపులు తగ్గి సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
మామిడి తోరణాలు
ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఇల్లంతా సంపదతో నిండి ఉంటుంది.
రాళ్ల ఉప్పు పరిహారం
అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పు వేసి మూట కట్టి ఇంటి ముఖద్వారానికి కట్టాలి. రాళ్ల ఉప్పుకి ఎంతో శక్తి ఉంటుంది. నరదృష్టి వంటివి తగలవు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


