2026 Ekadashi Dates List: 2026లో మొదటి ఏకాదశి ఎప్పుడు వచ్చింది? ఏకాదశుల పూర్తి లిస్ట్ ఇదిగో
హిందూ మతంలో ఏకాదశిని చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. ఏకాదశి నాడు విష్ణువును ప్రత్యేకించి ఆరాధిస్తారు. తులసిని ఆరాధిస్తారు. ఏకాదశి నాడు తలస్నానం చేసి, ధూప–దీప–నైవేద్యాలతో విష్ణువుని ఆరాధిస్తే విష్ణు ప్రత్యేక అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. చాలా మంది ఏకాదశి నాడు ఉపవాసము ఉంటారు.
2026 ఏకాదశులు: హిందూ మతంలో ఏకాదశిని చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. ఏకాదశి నాడు విష్ణువును ప్రత్యేకించి ఆరాధిస్తారు. తులసిని ఆ రోజు ప్రత్యేకించి ఆరాధిస్తారు. ఏకాదశి నాడు తలస్నానం చేసి, ధూప–దీప–నైవేద్యాలతో విష్ణువుని ఆరాధిస్తే విష్ణు ప్రత్యేక అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. అలాగే చాలా మంది ఏకాదశి నాడు ఉపవాసము ఉంటారు.

ఏకాదశి నాడు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. ఏకాదశి నాడు వీటిని ఆచరించడం వలన కష్టాలన్నీ తొలగిపోతాయని, ఆనందంగా ఉండొచ్చు అని నమ్ముతారు. ఏకాదశి నాడు చాలా మంది రాత్రిపూట మేల్కొని పాటలు, నృత్యాలు మొదలైన వాటిలో పాల్గొని భగవంతుడుని పూజిస్తారు.
24 ఏకాదశులు
ప్రతి ఏడాది 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి. వీటిలో 12 శుక్లపక్షంలో, 12 కృష్ణపక్షంలో వస్తాయి. ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు వైకుంఠానికి వెళ్తారని అంటారు. ఏకాదశి నాడు భక్తిశ్రద్ధలతో విష్ణువుని ఆరాధిస్తే పాపాలన్నీ తొలగిపోతాయి. అయితే 2025 త్వరలోనే పూర్తి కాబోతోంది, 2026 రాబోతోంది. 2026లో వచ్చే 24 ఏకాదశులకు సంబంధించిన వివరాలను చూద్దాం. 2026లో ఎప్పుడు ఏకాదశులు వచ్చాయి, ఏ రోజు ఏ ఏకాదశి వచ్చందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
2026 సంవత్సరంలో ఏకాదశి తేదీల పూర్తి జాబితా
షట్టిల ఏకాదశి - 14 జనవరి 2026
జయ ఏకాదశి - 29 జనవరి 2026
విజయ ఏకాదశి - 13 ఫిబ్రవరి 2026
అమలకి ఏకాదశి - 27 ఫిబ్రవరి 2026
పాపమొచనీ ఏకాదశి - 15 మార్చి 2026
కామద ఏకాదశి - 29 మార్చి 2026
వరూధిని ఏకాదశి - 13 ఏప్రిల్ 2026
మోహిని ఏకాదశి - 27 ఏప్రిల్ 2026
అపర ఏకాదశి - 13 మే 2026
పద్మిని ఏకాదశి - 27 మే 2026
పరమ ఏకాదశి - 11 జూన్ 2026
నిర్జల ఏకాదశి - 25 జూన్ 2026
యోగిని ఏకాదశి - 10 జూలై 2026
దేవశయిని ఏకాదశి - 25 జూలై 2026
కామిక ఏకాదశి - 9 ఆగస్టు 2026
శ్రావణ పుత్రద ఏకాదశి - 23 ఆగస్టు 2026
అజ ఏకాదశి - 7 సెప్టెంబర్ 2026
పరివర్తిని ఏకాదశి - 22 సెప్టెంబర్ 2026
ఇందిరా ఏకాదశి - 6 అక్టోబర్ 2026
పాపంకుశ ఏకాదశి - 22 అక్టోబర్ 2026
రామ ఏకాదశి - 5 నవంబర్ 2026
దేవుత్తని ఏకాదశి - 20 నవంబర్ 2026
ఉత్పన్న ఏకాదశి - 4 డిసెంబర్ 2026
మోక్షద ఏకాదశి - 20 డిసెంబర్ 2026
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


