వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సంపద, సానుకూల శక్తిని ఆకర్షించే ఈ 5 మొక్కలను పెట్టండి.. ఇక 2026లో అంతా శుభమే!
వాస్తు ప్రకారం పాటించడం వలన ఇంట్లో ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. 2025 త్వరలోనే పూర్తి కాబోతోంది. 2026లోకి అడుగుపెట్టబోతున్నాం. 2026లో ఇల్లు అందంగా ఉండడంతో పాటు ఆనందంగా, ప్రశాంతంగా, సానుకూల శక్తితో నిండి ఉండాలంటే ఇంట్లో ఈ మొక్కలను నాటండి. ఈ మొక్కలు సానుకూల శక్తిని తీసుకురావడానికి బాగా ఉపయోగపడతాయి.
చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇంట్లో ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. 2025 త్వరలోనే పూర్తి కాబోతోంది. 2026లోకి అడుగుపెట్టబోతున్నాం. 2026లో ఇల్లు అందంగా ఉండడంతో పాటు ఆనందంగా, ప్రశాంతంగా, సానుకూల శక్తితో నిండి ఉండాలంటే ఇంట్లో ఈ మొక్కలను నాటండి.

ఈ మొక్కలు సానుకూల శక్తిని తీసుకురావడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇంట్లో ఈ మొక్కలు ఉండడం వలన ప్రతికూల ఎనర్జీ ఉండదు. సంతోషంగా ఉండడానికి కూడా వీలవుతుంది. మరి ఇంట్లో ఎలాంటి మొక్కలు పెడితే సానుకూల శక్తి వ్యాపిస్తుంది? వాస్తు ప్రకారం ఏ మొక్కలు శాంతిని, డబ్బును తీసుకొస్తాయి? ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో వాస్తు ప్రకారం ఈ మొక్కలను పెడితే 2026లో అదృష్టం మీ వెంటే ఉంటుంది
1.మనీ ప్లాంట్:
చాలా మంది ఇళ్లలో మనీ ప్లాంట్ ఉంటుంది. ఈ మొక్క సానుకూల శక్తిని తీసుకురావడానికి బాగా ఉపయోగపడుతుంది. వాస్తు ప్రకారం ఈ మొక్కను ఆగ్నేయ దిశలో పెడితే మంచిది. డబ్బుకు లోటు ఉండదు. బాల్కనీ లేదా కిటికీల్లో కూడా పెట్టుకోవచ్చు.
2.లక్కీ బ్యాంబు:
లక్కీ బ్యాంబు మొక్కను ఇంట్లో పెడితే సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వెదురు మొక్కను ఇంట్లో పెట్టడం వలన ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. ఈ మొక్కను ఇంట్లో తూర్పు వైపు పెట్టండి.
3.జేడ్ ప్లాంట్:
జేడ్ ప్లాంట్ ఇంట్లో ఉంటే డబ్బుకు కొరత ఉండదు. ఆర్థిక ఇబ్బందుల నుంచి సులువుగా బయటపడవచ్చు. ఈ మొక్కను చాలామంది దీపావళి, ఇంటి గృహప్రవేశం సమయంలో ఇంట్లో పెడుతూ ఉంటారు. ఈ మొక్కను ఇంట్లో పెట్టడం వలన స్థిరత్వం ఉంటుంది, అభివృద్ధిని కూడా చూడొచ్చు. కొత్త వాటిని ప్రారంభించడానికి ముందు కూడా ఈ మొక్క చాలా మంచిది. 2026 ప్రారంభంలో ఈ మొక్కను ఇంటికి తీసుకురండి. ఇక మీ కష్టాలన్నీ తొలగిపోతాయి.
4.స్నేక్ ప్లాంట్:
స్నేక్ ప్లాంట్ అందంగా ఉండటమే కాదు, ప్రతికూల శక్తిని కూడా తొలగించగలదు. ఈ మొక్కను ఇంటి నైరుతి వైపు పెడితే మంచిది. లేదంటే పని ప్రదేశంలో కూడా పెట్టుకోవచ్చు. ఈ మొక్క ఉండడం వలన ప్రొడక్టివిటీ పెరుగుతుంది. 2026లో అదృష్టం కలిసి రావాలన్నా, ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉండాలన్నా ఈ మొక్కను ఇంట్లో పెట్టడం మంచిది.
5.పీస్ లిల్లీ:
పీస్ లిల్లీ మొక్క ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తి తొలగి సానుకూల శక్తి వ్యాపిస్తుంది. 2026లో అన్నీ కలిసి రావాలంటే ఈ మొక్కను కూడా ఇంట్లో పెట్టండి. ఇది ఎమోషనల్ బ్యాలెన్స్‌కు సహాయపడుతుంది. అలాగే ఇంట్లో ఆనందాన్ని కూడా పెంచుతుంది.
2026 వాస్తు గోల్డెన్ రూల్స్:
- 2026లో అన్నీ బాగా కలిసి రావాలంటే ఎప్పటికప్పుడు మొక్కలను కట్ చేస్తూ ఉండండి. పసుపు రంగులో ఉన్న ఆకులను తొలగిస్తూ ఉండండి. అలాంటివి తొలగించకపోతే ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది.
- ప్లాస్టిక్ కుండీలకు బదులుగా మట్టి లేదా సిరామిక్ కుండీలను ఉపయోగించండి. ప్లాస్టిక్ కుండీల వలన పర్యావరణం దెబ్బతింటుంది.
- ఎప్పుడూ కూడా ఒకే చోట ఎక్కువ మొక్కలను పెట్టకండి. మొక్కలను అన్ని దిశల్లో ఉంచండి. ఒకే చోట ఎక్కువ మొక్కలు ఉండడం మంచిది కాదు.
- లక్కీ బ్యాంబు మొక్క ఎప్పుడూ మంచి నీటితోనే ఉండాలి. వారానికి ఒకసారి నీటిని మారుస్తూ ఉండండి. అప్పుడే ఆర్థిక ప్రవాహం ఉంటుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


