Ketu Transit: అంతుచిక్కని కేతువు సంచారం, 2026 జనవరి నుండి అద్భుతాలను చూపుతుంది.. ఈ 3 రాశులకు అకస్మాత్తుగా డబ్బు!

గ్రహాల సంచారంలో మార్పులు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితాల్లో కూడా అనేక మార్పులను తీసుకొస్తుంది. గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. 2026 జనవరిలో కేతువు పూర్వఫాల్గుణి నక్షత్రం మొదటి పాదంలోకి ప్రవేశించబోతున్నాడు.

Published on: Dec 25, 2025, 10:00:16 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Horoscope Ketu 2026: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పులు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితాల్లో కూడా అనేక మార్పులను తీసుకొస్తుంది. గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. కొన్ని సార్లు రెండు, మూడు గ్రహాల సంయోగం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అది కూడా అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకు వస్తుంది.

Ketu Transit: అంతుచిక్కని కేతువు సంచారం
Ketu Transit: అంతుచిక్కని కేతువు సంచారం

కేతువు సంచారం

రాహువు, కేతువులను నీడ గ్రహాలుగా భావిస్తారు. కేతువు సంచారం కొన్నిసార్లు నష్టాలను తీసుకొస్తుంది, కొన్నిసార్లు లాభాలను కూడా అందిస్తుంది. కొన్ని సందర్భాల్లో కేతువు సంచారం కారణంగా కొన్ని రాశుల వారు విపరీతమైన అదృష్టాన్ని పొందుతారు. 2025 ఇక త్వరలోనే పూర్తికాబోతోంది. 2026లోకి అడుగుపెట్టబోతున్నాము. 2026లో ప్రధాన గ్రహాల సంచారంలో అనేక మార్పులు ఉన్నాయి. త్వరలోనే కేతువు తన వేగాన్ని మార్చబోతున్నాడు.

ప్రస్తుతం కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే, సింహ రాశిలో ఉన్న కేతువు త్వరలోనే నక్షత్రాలు, రాశులను మార్చబోతున్నాడు. కొత్త సంవత్సరం ప్రారంభంలో కేతువు కదలికల్లో మార్పు రాబోతోంది. ప్రస్తుతం కేతువు పూర్వఫాల్గుణి నక్షత్రం రెండవ పాదంలో ఉన్నాడు. 2026 జనవరిలో కేతువు పూర్వఫాల్గుణి నక్షత్రం మొదటి పాదంలోకి ప్రవేశించబోతున్నాడు. ఇలా కేతువు నక్షత్ర సంచారంలో మార్పు రావడంతో కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టం కలగబోతోంది. మరి అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశుల వారికి కేతువు సంచారం లాభదాయకంగా ఉండబోతోందో తెలుసుకుందాం.

జనవరి 2026లో కేతువు సంచారంలో మార్పు.. ఈ రాశుల వారికి అద్భుతాలు

1.సింహ రాశి:

సింహ రాశి వారికి కేతువు సంచారం బాగా కలిసి రాబోతోంది. సింహ రాశి వారు అనేక లాభాలను పొందుతారు. పురోగతి మార్గాలు తెరుచుకుంటాయి. ప్రేమ జీవితంలో ఆనందం ఎక్కువవుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థికపరంగా కూడా అనేక లాభాలను పొందుతారు. కెరీర్‌లో స్నేహితుల నుంచి మీకు మద్దతు వస్తుంది. కొత్త బాధ్యతలను కూడా చేపడతారు.

2.వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి కేతువు సంచారం శుభ ఫలితాలను తీసుకు రానుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో అదృష్టం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. వ్యాపారస్తులకు కూడా ఇది మంచి సమయం. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మొత్తం మీద కేతువు సంచారం ఈ రాశి వారికి బాగా కలిసి రాబోతోంది.

3.వృషభ రాశి:

వృషభ రాశి వారికి కేతువు సంచారం ప్రయోజనకరంగా ఉండబోతోంది. పెట్టుబడుల నుంచి ఎక్కువ రాబడి వస్తుంది. ప్రతి పనిలో విజయాన్ని అందుకుంటారు. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. స్నేహితులతో పర్యటనకు వెళ్తారు. భాగస్వామితో వస్తున్న సమస్యలు తగ్గుతాయి. ఆనందంగా ఉంటారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More